Begin typing your search above and press return to search.

సూపర్ లైనప్ సెట్ చేసిన శర్వా..!

మోటర్ సైకిల్ రేసింగ్ నేపథ్యంతో లూసర్ వెబ్ సీరీస్ ఫేం అభిలాష్ రెడ్డి డైరెక్షన్ లో శర్వానంద్ ఒక సినిమా చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   1 May 2025 1:00 AM IST
సూపర్ లైనప్ సెట్ చేసిన శర్వా..!
X

యువ హీరోల్లో టాలెంట్ ఉన్న నటుడిగా తన సత్తా చాటుతూ వస్తున్నాడు శర్వానంద్. శర్వానంద్ సినిమా అంటే సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంటాయి. ఫలితాలు కాస్త నిరాశపరచినా తన ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు శర్వానంద్. లాస్ట్ ఇయర్ మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్ ఆ సినిమా తర్వాత మూడు క్రేజీ సినిమాలతో వస్తున్నాడు. శర్వా సినిమాల లైనప్ ఆడియన్స్ ని సూపర్ ఎగ్జైట్ చేస్తుంది.

ముందుగా శర్వానంద్ రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో నారి నారి నడుమ మురారి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ని బట్టే సినిమా ఎలా ఉంటుందో చెప్పొచ్చు. సినిమాలో శర్వానంద్ సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్య నటిస్తున్నారు. ఈమధ్యనే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్ ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ సినిమా తో పాటు శర్వానంద్ ఒక రేసింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నాడు.

మోటర్ సైకిల్ రేసింగ్ నేపథ్యంతో లూసర్ వెబ్ సీరీస్ ఫేం అభిలాష్ రెడ్డి డైరెక్షన్ లో శర్వానంద్ ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటుంది. శర్వానంద్ కెరీర్ లో ఈ సినిమా ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు. ఇక మరోపక్క లేటెస్ట్ గా శర్వానంద్ సంపత్ నంది తో సినిమా అనౌన్స్ చేశాడు. భోగి అంటూ పాన్ ఇండియా అటెంప్ట్ తోనే శర్వానంద్ వస్తున్నాడు.

ఈ సినిమా కూడా సంథింగ్ క్రేజీగా ఉండేలా ఉంది. సో మిగతా హీరోలతో పాటు తన కెరీర్ లో కూడా దూకుడు పెంచాడు శర్వానంద్. తప్పకుండా ఈ సినిమాలతో ఈ హీరో నెక్స్ట్ లెవెల్ రిజల్ట్ అందుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. శర్వానంద్ రాబోయే సినిమాల విషయంలో ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఉన్నారు. మరి వీటిలో ఏది ముందు ఏది వెనక వస్తుంది అన్నది తెలియదు కానీ శర్వానంద్ లైనప్ మాత్రం ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేసేలా ఉంది.

సంపత్ నందితో భోగి అంటూ పాన్ ఇండియా సినిమా తో వస్తున్న శర్వానంద్ ఆ సినిమాతో పెద్ద ప్లానింగే ఉన్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా సంపత్ నంది 4 ఏళ్ల తర్వాత డైరెక్షన్ చేస్తున్న సినిమాగా భోగి సంథింగ్ క్రేజీ అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్.. అంతకన్నా ఇంట్రెస్టింగ్ విషయాలతో శర్వానంద్ తన నెక్స్ట్ సినిమాలు చేస్తున్నాడు. వాటి ఫలితాలు అతన్ని ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేస్తాయో లేదో చూడాలి.