ఆమెతో శర్వా.. జోడి బాగుందే..!
మలయాళ భామ సంయుక్త మీనన్ భీమ్లా నాయక్ తో తెలుగు ఎంట్రీ ఇవ్వగా ఆ క్రేజ్ తో సార్, విరూపాక్ష సినిమాలతో సక్సెస్ అందుకుంది.
By: Tupaki Desk | 24 April 2025 8:15 PM ISTమలయాళ భామ సంయుక్త మీనన్ భీమ్లా నాయక్ తో తెలుగు ఎంట్రీ ఇవ్వగా ఆ క్రేజ్ తో సార్, విరూపాక్ష సినిమాలతో సక్సెస్ అందుకుంది. తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించినట్టు అనిపించిన అమ్మడు కాస్త వెనకపడినట్టు అనిపిస్తుంది. ప్రస్తుతం నిఖిల్ తో స్వయంభు, శర్వానంద్ తో నారి నారి నడుమ మురారి సినిమాతో రాబోతుంది అమ్మడు. ఈ రెండు సినిమాలతో మళ్లీ తెలుగులో సత్తా చాటాలని చూస్తుంది సంయుక్త మీనన్.
స్వయంభు సినిమా ఎక్కడిదాకా వచ్చింది అన్నది అప్డేట్ రాలేదు. అసలు ఆ సినిమా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. హీరో నిఖిల్ కూడా స్వయంభుకి సంబంధించిన ఏ విషయాలను రివీల్ చేయట్లేదు. ఇదిలా ఉంటే సంయుక్త మీనన్ శర్వానంద్ తో జత కడుతున్న నారి నారి నడుమ మురారి సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ సినిమా నుంచి ఈమధ్యనే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
ముఖ్యంగా ఈ సాంగ్ లో శర్వానంద్, సంయుక్త మీనన్ ల జోడీ ఇంప్రెస్ చేసింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయినట్టు అనిపిస్తుంది. నారి నారి నడుమ మురారి సినిమాకు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సంయుక్త మీనన్ స్క్రీన్ ప్రెజన్స్ ఆమె ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది.
శర్వానంద్, సంయుక్త మీనన్ ఈ ఇద్దరి కెమిస్ట్రీ పరంగా చూస్తే సినిమా బాగానే వస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తుంది. రాం అబ్బరాజు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రోమ్ కోమ్ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది. మనమే తర్వాత శర్వానంద్ నారి నారి నడుమ మురారి సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాతో పాటు మరో రేసింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది.
యువ హీరోల్లో ఎలాంటి కథలకైనా పర్ఫెక్ట్ గా సూటయ్యే కేపబిలిటీ ఉన్న యాక్టర్ శర్వానంద్ కెరీర్ హిట్లు ఫ్లాపుల మధ్య ఊగిసలాడుతున్నా కూడా తన ప్రయత్నాలను మాత్రం ఆపట్లేదు. మరి రాబోతున్న ఈ సినిమాలతో అయినా శర్వానంద్ సక్సెస్ ఫాం కొనసాగిస్తాడేమో చూడాలి. శర్వానంద్ నెక్స్ట్ సినిమాల్లో సోగ్గాడే చిన్ని నాయనా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో కూడా ఒక ప్రాజెక్ట్ డిస్కషన్ స్టేజ్ లో ఉందని తెలుస్తుంది.