రెండు భారీ టార్గెట్స్ తో శర్వానంద్..!
యువ హీరో శర్వానంద్ మనమే తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి ఈసారి ఒకేసారి రెండు భారీ సినిమాలతో రాబోతున్నాడు.
By: Tupaki Desk | 2 Jun 2025 3:00 AM ISTయువ హీరో శర్వానంద్ మనమే తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి ఈసారి ఒకేసారి రెండు భారీ సినిమాలతో రాబోతున్నాడు. అందులో ఒకటి మళ్లీ తన మార్క్ ఎంటర్టైనర్ ప్రాజెక్ట్ తో వస్తుండగా మరొకటి మాస్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు శర్వానంద్. శర్వానంద్ హీరోగా శ్రీవిష్ణుతో సామజవరగమన తో హిట్ అందుకున్న డైరెక్టర్ రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో వస్తున్న సినిమా నారి నారి నడుమ మురారి. ఈ సినిమాలో శర్వానంద్ సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్యలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ ఆడియన్స్ ని అలరించింది. ఇక దీనితో పాటు శర్వానంద్ సంపత్ నంది కాంబినేషన్ లో భోగి అనే సినిమా వస్తుంది. ఈ సినిమా మాస్ యాక్షన్ మూవీగా రాబోతుంది. సంపత్ నంది ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ చేస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఈమధ్యనే రిలీజైన భోగి ఫస్ట్ గ్లింప్స్ తోనే అదుర్స్ అనిపించారు. శర్వానంద్ ఈ రెండు సినిమాల మీద పూర్తిగా ఫోకస్ పెట్టాడని తెలుస్తుంది.
యువ హీరోలంతా కూడా హిట్లు సూపర్ హిట్లతో 100 కోట్లు కూడా కొట్టేస్తున్న ఈ టైం లో సినిమాలు సక్సెస్ చేసుకోలేక వెనకపడ్డాడు శర్వానంద్. అందుకే రాబోతున్న సినిమాల విషయంలో మరింత జాగ్రత్త వహిస్తున్నాడని తెలుస్తుంది. రామ్ అబ్బరాజు ఆల్రెడీ హిట్ కొట్టి ఆడియన్స్ పల్స్ పట్టేశాడు కాబట్టి అతనితో చేస్తున్న నారి నారి నడుమ మురారి సినిమా ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అందించేలా ఉంటుందని చెప్పొచ్చు.
మరోపక్క సంపత్ నంది సినిమా కూడా పవర్ ఫుల్ టైటిల్ మంచి నేపథ్యంతో రాబోతుందని తెలుస్తుంది. సో ఈ రెండు సినిమాలతో శర్వానంద్ మంచి కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. నారి నారి నడుమ మురారి ఫ్యామిలీస్ మెచ్చేలా ఉంటుందని తెలుస్తుండగా సంపత్ నంది తో చేస్తున్న భోగి మాత్రం మాస్ మసాలా బొమ్మగా వస్తుంది. మరి శర్వానంద్ లోని మాస్ ని సంపత్ నంది ఎలా వాడుకున్నాడు అన్నది సినిమా వస్తేనే చెప్పగలం. ఈ రెండిటితో పాటు శర్వానంద్ ఒక రైడర్ బ్యాక్ డ్రాప్ మూవీ కూడా చేస్తున్నాడని తెలిసిందే. లూజర్ ఫేమ్ అభిలాష్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ ఈ మూవీని నిర్మించనున్నారు.
