భోగితో శర్వా పాన్ ఇండియా ప్రయోగం?
చార్మింగ్ స్టార్ శర్వానంద్, సంపత్ నంది దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామా చేయనున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 30 April 2025 8:17 AMచార్మింగ్ స్టార్ శర్వానంద్, సంపత్ నంది దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామా చేయనున్న విషయం తెలిసిందే. శర్వ కెరీర్లో 38వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తున్న విషయాన్ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఫస్ట్ స్పార్క్ పేరుతో చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేయగా, ఆ గ్లింప్స్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది.
గ్లింప్స్ చూస్తుంటే ఈ సినిమా విలేజ్ యాక్షన్ డ్రామా అని అర్థమవుతుంది. అంతేకాదు, ఆ వీడియోలో మోర్ వయొలెన్స్ అని చెప్తున్నారంటే సినిమాలో హింస ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడూ సాఫ్ట్ సినిమాలు చేస్తూ పక్కింటి అబ్బాయిలా కనిపించే శర్వానంద్ ఈ మూవీ కోసం భారీగా మేకోవర్ కానున్నాడని తెలుస్తోంది.
దీంతో ఈ సినిమాలో శర్వా లుక్ ఎలా ఉంటుందోనని చూడ్డానికి అందరూ ఎంతగానో ఆసక్తిగా ఉన్నారు. శర్వా కెరీర్ లో 38వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ స్పార్క్ ను రిలీజ్ చేయడంతో పాటూ ఈ సినిమా టైటిల్ ను భోగి అని కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. టైటిల్ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది.
1960ల కాలం నాటి తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దు గ్రామంలో జరిగిన కథ ఆధారంగా ఈ యాక్షన్ డ్రామా రూపొందుతున్నట్టు సమాచారం. అంతేకాదు, ఈ సినిమా కొన్ని నిజ జీవిత సంఘటనల నుంచి పుట్టిందని కూడా మేకర్స్ చెప్తున్నారు. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అనౌన్స్‌మెంట్ వీడియోలోని హై క్వాలిటీ వీఎఫెక్స్ అందరినీ ఆకట్టుకోగా, ఈ సినిమా షూటింగ్ ఇవాళ హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్ లో ప్రారంభమైంది. కె.కె రాధామోహన్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. భోగితో శర్వా కూడా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు.