Begin typing your search above and press return to search.

బర్త్ డే స్పెషల్ గా డాటర్ ను పరిచయం చేసిన యంగ్ హీరో!

అయితే ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా తనకు పాప పుట్టిందనే విషయాన్ని వెల్లడిస్తూ.. తన ముద్దుల కూతురు పేరును కూడా బయటపెట్టాడు.

By:  Tupaki Desk   |   6 March 2024 2:56 PM GMT
బర్త్ డే స్పెషల్ గా డాటర్ ను పరిచయం చేసిన యంగ్ హీరో!
X

టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఈరోజు (మార్చి 6) తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. మూడు కొత్త సినిమాల అప్డేట్లు ఇవ్వడంతో పాటుగా, వాటిల్లో ఒక చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రత్యేకమైన రోజును మరింత స్పెషల్ గా మార్చడానికి శర్వా ఓ గుడ్ న్యూస్ ను అభిమానులతో షేర్ చేసుకున్నారు.

శర్వానంద్, రక్షిత రెడ్డి దంపతులు ఇటీవల తల్లిదండ్రులు అయ్యారు. రక్షిత పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ శుభవార్తను శర్వా ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా తనకు పాప పుట్టిందనే విషయాన్ని వెల్లడిస్తూ.. తన ముద్దుల కూతురు పేరును కూడా బయటపెట్టాడు.

శర్వానంద్, రక్షిత రెడ్డి దంపతులు తమ డార్లింగ్ కుమార్తెకు 'లీలా దేవి మైనేని' అనే అచ్చతెలుగు పేరు పెట్టారు. తమ ఫ్యామిలీలోకి వచ్చిన కొత్త మెంబర్ ను పరిచయం చేయడానికి ఇదే శుభ సందర్భం అని భావించిన శర్వా.. పాపతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తమ ఆనందకరమైన క్షణాలను పంచుకున్నారు. ఈ వార్త శర్వానంద్ అభిమానులలో ఉత్సాహాన్ని నింపింది. సినీ ప్రముఖులు, అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

శర్వానంద్ మైనేని 1984 మార్చి 6న వసుంధరా దేవి - రత్నగిరి వర ప్రసాదరావు దంపతులకు జన్మించాడు. 2023 జూన్ 3న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది పసునూరు మధుసూధన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డిని వివాహం చేసుకున్నారు శర్వా. ఈ క్రమంలో ఇప్పుడు తన పుట్టిన రోజు సందర్భంగా కూతురు లీలా దేవి మైనేని ని అందరికీ పరిచయం చేశారు.

ఇక సినిమాల విషయానికొస్తే, శర్వానంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'మనమే' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. నిజజీవితంలో తండ్రిగా మారిన శర్వా.. ఈ మూవీలో తండ్రిగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఇక యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అభిలాష్ కంకర దర్శకత్వంలో 'Sharwa 36' సినిమా చేయనున్నారు. అలానే ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ లో రామ్ అబ్బరాజుతో తన 37వ సినిమాలో శర్వా నటించనున్నారు.