Begin typing your search above and press return to search.

బూమ్ బూమ్.. బాలీవుడ్ బ్యూటీతో శర్వా పార్టీ!

పార్టీ వైబ్స్ తో ఉన్న ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ సీరత్ కుమార్ డ్యాన్స్ కు అంతా ఫిదా అవుతున్నారు.

By:  Tupaki Desk   |   7 Jun 2024 7:39 AM GMT
బూమ్ బూమ్.. బాలీవుడ్ బ్యూటీతో శర్వా పార్టీ!
X

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్.. రెండేళ్ల గ్యాప్ తర్వాత మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ దక్కించుకున్న ఈ మూవీ ప్రస్తుతం దూసుకుపోతోంది. సినిమా అంతా బాగుందని సోషల్ మీడియాలో రివ్యూలు ఇస్తున్నారు నెటిజన్లు. శ్రీరామ్ ఆదిత్య గ్రాండ్ గా తెరకెక్కించిన ఈ సినిమాలో బ్యూటిఫుల్ కృతి శెట్టి హీరోయిన్ గా యాక్ట్ చేసింది. టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో మనమే చిత్రాన్ని రూపొందించారు.

ఓవైపు మూవీ ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తుండగా.. మరోవైపు సోషల్ మీడియాలో బూమ్ బూమ్ సాంగ్ తెగ ట్రెండ్ అవుతోంది. పార్టీ వైబ్స్ తో ఉన్న ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ సీరత్ కుమార్ డ్యాన్స్ కు అంతా ఫిదా అవుతున్నారు. సూపర్ హిట్ మూవీ రన్ రాజా రన్‌ తర్వాత మరోసారి శర్వాతో చిందులేసింది సీరత్. ఇప్పటికే మనమే నుంచి వచ్చిన మూడు సాంగ్స్ అలరించగా.. ఫోర్త్ సింగిల్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

బూమ్ బూమ్ అంటూ సాగుతున్న ఈ లిరికల్ సాంగ్ ను మేకర్స్ నిన్న సాయంత్రం రిలీజ్ చేశారు. ఖుషి మూవీ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సాంగ్ కు క్రేజీ మ్యూజిక్ అందించగా.. యంగ్ సింగర్ హేమచంద్ర పాడారు. పార్టీ వైబ్స్ తో ఉన్న ఈ సాంగ్ కు భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. అమ్మాయితో ప్రేమలో పడిన తర్వాత బ్యాడ్ బాయ్ నుంచి మంచి అబ్బాయిగా శర్వా ఎలా మారాడన్న విషయాన్ని మేకర్స్ ఈ పాటలో చూపించారు.

సాంగ్ లో శర్వానంద్ తనదైన స్టెప్పులతో అలరించారు. రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రఫీ బాగుందని నెటిజన్లు చెబుతున్నారు. విజువల్స్, ట్యూన్ అదిరిపోయాయని కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో 16 పాటలు ఉంటాయని డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెలిపారు. అందులో కొన్ని పెద్దగా, మరికొన్ని చిన్నగా ఉన్నాయని చెప్పారు. సీన్స్ కు ఎలివేషన్లు ఇచ్చేందుకు యూజ్ చేశామని కూడా వెల్లడించారు.

మరోవైపు, ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా మంచి థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 11.50 కోట్ల‌కు థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. రూ.12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ తో మూవీ రిలీజ్ అయినట్లు టాక్ నడుస్తోంది. సెన్సార్ బోర్డు అధికారుల నుంచి యూ/ఏ సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అవుతుందో? ఫస్ట్ డే ఎంత వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.