Begin typing your search above and press return to search.

శర్వా 36.. హిట్టు కాంబినేషన్లో గట్టి ప్లానే..

యువ హీరో శర్వానంద్ నేడు పుట్టినరోజు సందర్భంగా లైన్ లో పెట్టిన సినిమాల అప్డేట్స్ తో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాడు

By:  Tupaki Desk   |   6 March 2024 8:17 AM GMT
శర్వా 36.. హిట్టు కాంబినేషన్లో గట్టి ప్లానే..
X

యువ హీరో శర్వానంద్ నేడు పుట్టినరోజు సందర్భంగా లైన్ లో పెట్టిన సినిమాల అప్డేట్స్ తో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాడు. 35వ చిత్రం మనమే.. అనే టైటిల్ తో రాబోతోంది. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమా సమ్మర్ లో విడుదల కానుంది. ఇక 36వ సినిమాను సూపర్ హిట్ వెబ్ సిరీస్ 'లూజర్' ఫేమ్ దర్శకుడు అభిలాష్ కంకరతో చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.

యువి క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రం బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోంది. అభిలాష్ కంకర ఇదివరకే మా నాన్న సూపర్‌హీరో అనే సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు శర్వా 36వ సినిమాను సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. విక్రమ్ సమర్పణలో వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఒక విధంగా ఇది హిట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు అనే మూడు బ్లాక్‌బస్టర్‌ సినిమాలు కూడా ఈ సంస్థలోనే వచ్చాయి. శర్వానంద్‌కి UV క్రియేషన్స్ లక్కీ ప్రొడక్షన్ హౌస్ గా నిలుస్తోంది. ఇక శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా, ఈ ఆసక్తికరమైన పోస్టర్ ద్వారా ఈ కొత్త ప్రాజెక్టుపై అధికారికంగా క్లారిటీ ఇచ్చారు.

ఇది రఫ్ గా ఉండే రోడ్డులో రేసింగ్ చేస్తున్న బైక్ రైడర్‌ లతో పోస్టర్ నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంది. రేసులో తన ప్రత్యర్థులను అధిగమించేందుకు ఎత్తుగా ఎగురుతున్న రైడర్ జాకెట్‌పై S 36ని చూడవచ్చు. పోస్టర్ సూచించినట్లుగా, ఇది స్పోర్ట్స్ బేస్డ్ మూవీగా ఉండబోతోంది, ఇందులో కథానాయకుడు శర్వా బైక్ రైడర్‌గా కనిపిస్తాడు. ఎక్కువగా 90లో అలాగే 20వ దశకం ప్రారంభంలో కొనసాగే మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ గా సినిమా ఉంటుందట.

మూడు తరాల కుటుంబానికి సంబంధించిన ఆకర్షణీయమైన కథతో దర్శకుడు లవ్ అలాగే హీరో లక్ష్యాన్ని తనదైన శైలిలో చూపించబోతున్నట్లు సమాచారం. మొదటిసారిగా, శర్వానంద్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో అలాంటి చిత్రాన్ని చేస్తుండడం విశేషం. అతని క్యారెక్టరైజేషన్ పూర్తిగా భిన్నంగా ఉంటుందట. ఈ సినిమాలో శర్వానంద్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. జిల్, రన్ రాజా రన్ వంటి సినిమాలకి మ్యూజిక్ ఇచ్చిన జిబ్రాన్ సంగీతం అందించగా, జె యువరాజ్ సినిమాటోగ్రఫర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ తర్వలో తెలియజేయనున్నారు.