Begin typing your search above and press return to search.

అసిస్టెంట్ నుంచి హీరోయిన్ గా!

అలా బాలీవుడ్ లో కూడా ఓ న‌టి అసిస్టెట్ గా జ‌ర్నీ మొద‌లు పెట్టి హీరోయిన్ గా ఎదిగిన‌ట్లు తెలుస్తోంది. ఆమె బాలీవుడ్ బ్యూటీ శార్వరీ వాఘ్‌.

By:  Tupaki Desk   |   27 Dec 2023 4:30 PM GMT
అసిస్టెంట్ నుంచి హీరోయిన్ గా!
X

ఇండ‌స్ట్రీలో అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా...రైట‌ర్ గా... ప్ర‌యాణం మొద‌లు పెట్టి హీరో..హీరోయిన్ గా ఎద‌గ‌డం అంటే రాసి పెట్టి ఉండాలి. టాలీవుడ్ లో అలా తిరుగులేని హీరోగా ఎదిగింది ఎవ‌రంటే? నేచుర‌ల్ స్టార్ నాని పేరు గుర్తొస్తుంది. ఇంకా నేటి జ‌న‌రేష‌న్ న‌టుల్లో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌....కిర‌ణ్ అబ్బ‌వ‌రం లాంటి న‌టులు అలా ఎదిగిన వారే. ఇలాగే ప్ర‌య‌త్నాలు చేసి ఇంకా అక్క‌డే మిగిలిపోయిన వారు ఎంతో మంది. హీరో అవ్వాలంటే అదృష్టం కూడా క‌లిసి రావాలి. ఆ ల‌క్ ప్యాక్ట‌ర్ వీళ్ల‌లో ఉంది కాబ‌ట్టే సాద్య‌మైంది.


అలా బాలీవుడ్ లో కూడా ఓ న‌టి అసిస్టెట్ గా జ‌ర్నీ మొద‌లు పెట్టి హీరోయిన్ గా ఎదిగిన‌ట్లు తెలుస్తోంది. ఆమె బాలీవుడ్ బ్యూటీ శార్వరీ వాఘ్‌. అమ్మ‌డి డెబ్యూ 'బంటీ ఔర్‌ బబ్లీ 2. ఈ సినిమాతోనే న‌టిగా ప‌రిచ‌య మైంది. అవార్డులు ..రివార్డులు సైతం తొలి సినిమాతోనే ద‌క్కించుకుంది. ఈ బ్యూటీ ఇప్పుడిప్పుడే నెట్టిం ట పాపుల‌ర్ అవుతోంది. ప్ర‌స్తుతం అమ్మ‌డు 'మహారాజా'.. 'వేదా' లాంటి చిత్రాల్లో అవ‌కాశాలు అందు కుంది. ఈ సంద‌ర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు..తొలుత సంజయ్‌లీలా భన్సాలీగారి దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్ అయిందిట‌. 'బాజీరావ్‌ మస్తానీ' షూటింగ్‌ సమయంలో దీపికా- రణ్‌వీర్‌ సీన్స్‌ గురించి చెప్పే అవ‌కాశం వ‌చ్చిందిట‌.

వాళ్లిద్ద‌రితో అదే తొలి ప‌రిచ‌యం అంటోంది. అప్పుడే శ‌ర్వారీ లో స్పార్క్ చూసి 'నీ పేరు ఏంటని?' దీపికా అడిగి తెలుసుకుందిట‌. ఆ రోజు త‌న ఆనందానికి అవ‌దుల్లేవ్ అంటోంది. సినిమా వెనకాల పనిచేయటం వల్ల నటులు కూడా మనలాం టివారే అనిపించిందిట‌. అలాగే మాధురీ దీక్షిత్ కార‌ణంగా డాన్సు కూడా నేర్చుకుందిట‌. కథక్‌ కూడా తెలుసు అంటోంది. ఇంకా కీబోర్డు .. కిక్‌ బాక్సింగ్ లో కూడా కొంత అనుభ‌వం ఉందిట‌. అలా బాలీవుడ్ లో నిల‌దొక్క‌కున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక అమ్మ‌డికి సినిమా బ్యాక్ గ్రౌండ్ అయితే లేదుగానీ..రాజ‌కీయంగా తిరుగులేదు. మరాఠీ కుటుంబానికి చెందిన శార్వరీ ముంబైలో పుట్టి పెరిగింది. తన నాన్న శైలేష్‌ వాఘ్‌ రియల్‌ ఎస్టేట్‌లో బిల్డర్‌. అమ్మ నమ్రతా ఆర్కిటెక్‌. తన తాతయ్య మనోహర్‌ జోషి(1995-1999) మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారంది. అలాంటి ఫ్యామిలీ నుంచి వ‌చ్చి న‌టి అవుతానంటే ఒప్పుకోర‌ని భావించి కొన్నాళ్లు త‌న కొర్కెను అలాగే దాచేసుకుందిట‌. ఆ త‌ర్వాత త‌న లో స్కిల్స్ చూసి త‌ల్లిదండ్రులే ప్రోత్స‌హించి పంపించారు అంది.