ఐదేళ్ల క్రితం నాటి కోరిక ఇలా!
శార్వరీ వాఘ్ ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో జోరుగా వినిపిస్తోన్న పేరు. 'వేదా', 'ముంజ్యా' లాంటి విజయాలతో అమ్మడు లైమ్ లైట్ లోకి వచ్చింది.
By: Tupaki Desk | 16 Jun 2025 10:30 AMశార్వరీ వాఘ్ ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో జోరుగా వినిపిస్తోన్న పేరు. 'వేదా', 'ముంజ్యా' లాంటి విజయాలతో అమ్మడు లైమ్ లైట్ లోకి వచ్చింది. అప్పటికే ఎంతో కాలంగా ఇండస్ట్రీలో ఉన్నా? చేసిన సినిమాలేవి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. ముంజ్యా హిట్ తో బాగా ఫేమస్ అయింది. నటనతో పాటు అందం..అభినయం కూడా కలిసొచ్చాయి. ఈ క్రేజ్ చూసే యశ్ రాజ్ ఫిలింస్ ప్రతిష్టాత్మక చిత్రం 'ఆల్పా'లో ఛాన్స్ ఇచ్చింది.
ఇందులో అలియభట్ తో కలిసి శార్వరీ వాఘ్ నటిస్తుంది. అలియా పాత్రకు ధీటుగానే ఈ రోల్ ఉంటుంది. అలియాతో నటించడం పట్ల అమ్మడు ఇప్పటికే సంతోషాన్ని వ్యక్తం చేసింది. అలియా లాంటి ప్రతిభా వంతురాలితో నటించే ఛాన్స్ ఇంత తొందరగా వస్తుందనుకోలేదని తెలిపింది. ఓ నటిగా అలియాను చూసి ఎంతో నేర్చుకున్నట్లు వెల్లడించింది. అయితే తొలిసారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తోన్న ఇంతియాజ్ అలీ గురించి ఓపెన్ అయింది.
'నటిగా నా ప్రయాణం మొదలైన నాటి నుంచి ఇంతియాజ్ తో కలిసి సినిమా చేయాలనుకుంటున్నా. ఆ కోరిక ఈ సినిమాతో తీరుతుంది. ఇలాంటి వైవిథ్యమైన ప్రాజెక్ట్ లో నన్ను ఎంపిక చేయడం గర్వంగానే ఫీల వుతాను. ఎందుకంటే ఇంతియాజ్ తో పని చేయాలని చాలా మంది నటీమణులు అనుకుంటున్నారు. అవకాశం కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు.
వాళ్లెవ్వరికీ రాని అవకాశం నాకు వచ్చిందంటే? ప్రౌడ్ గా ఫీలవ్వాల్సిన సమయమే కదా' అంది. ప్రస్తుతం 'ఆల్పా' ఆన్ సెట్స్ లో ఉంది. రిలీజ్ కు మాత్రం చాలా సమయం పడుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లోనే ఈసినిమా రిలీజ్ అవుతుంది. అంతవరకూ ఈ సినిమాలో భాగమైనవారంతా ఇతర సినిమాలు కూడా చేసుకోవచ్చు.