డాన్ 3లో జాక్ పాట్ కొట్టిన నటి
రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఫర్హాన్ అక్తర్ తెరకెక్కిస్తున్న 'డాన్ 3' లో కథానాయికగా నటించాల్సి ఉండగా, ఇప్పుడు ఆ పాత్రను కియరా కోల్పోయింది. ప్రస్తుతం వేరొక నటితో రీప్లేస్ చేసారని సమాచారం.
By: Tupaki Desk | 16 April 2025 12:03 PM ISTకియరా అద్వాణీ పెళ్లి తర్వాత బిజీయెస్ట్ కథానాయిక. కరీనా, కత్రిన, ఆలియా తరహాలోనే కియరా క్రేజీ చిత్రాల్లో నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజా సమాచారం మేరకు రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఫర్హాన్ అక్తర్ తెరకెక్కిస్తున్న 'డాన్ 3' లో కథానాయికగా నటించాల్సి ఉండగా, ఇప్పుడు ఆ పాత్రను కియరా కోల్పోయింది. ప్రస్తుతం వేరొక నటితో రీప్లేస్ చేసారని సమాచారం.
కొంతకాలంగా కియారా అద్వానీ స్థానంలో సరైన నటి కోసం దర్శక నిర్మాతలు వెతుకుతున్నారు. ఇప్పటికి శార్వరిని ఫైనల్ చేసారని సమాచారం. ప్రాజెక్ట్ ఆలస్యం కావడం .. కియరా ఇతర షెడ్యూళ్లతో బిజీగా ఉండటమే దీనికి కారణం. శార్వరీ నేటితరంలో రైజింగ్ స్టార్. గత ఏడాది ముంజ్యాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ క్రేజీ హీరోయిన్ గా వెలిగిపోతోంది. మహారాజ్ , వేదా లాంటి చిత్రాలలో ఈ భామ నటించగా ఇవి విడుదలకు సిద్ధమవుతున్నాయి. యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న భారీ స్పై యాక్షన్ చిత్రం 'ఆల్ఫా' షూటింగ్‌ను కూడా పూర్తి చేసింది. ఈ చిత్రంలో అలియా భట్ ప్రధాన లీడ్ పోషిస్తుండగా, బాబీ డియోల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.
శార్వరి ఇప్పుడు డాన్ 3లో అవకాశం అందుకుంది. వరస పాన్ ఇండియా రిలీజ్ లతో ఈ బ్యూటీ దేశంలోనే క్రేజీయెస్ట్ హీరోయిన్ గా వెలిగిపోనుందని అంచనా. 2025 చివరిలో ఈ సినిమాని ప్రారంభిస్తారని సమాచారం. కాస్టింగ్ సెలక్షన్, స్క్రిప్టు పరంగా మెరుగులద్దడం కోసం ఫర్హాన్ చాలా సమయం తీసుకున్నారు. డాన్ 3లో షారూఖ్ స్థానంలో రణ్ వీర్ ని ఎంపిక చేయడం ఒక సంచలనం.
