Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ సినిమా రిలీజ్ కన్ ఫ్యూజన్ ఎలా..?

ఈ ఇయర్ ఆల్రెడీ రెండు బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన నెక్స్ట్ సినిమా డంకీతో కూడా హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

By:  Tupaki Desk   |   14 Nov 2023 6:35 AM GMT
సూపర్ స్టార్ సినిమా రిలీజ్ కన్ ఫ్యూజన్ ఎలా..?
X

ఈ ఇయర్ ఆల్రెడీ రెండు బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన నెక్స్ట్ సినిమా డంకీతో కూడా హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. రాజ్ కుమార్ హిరాణి డైరెక్షన్లో తెరకెక్కిన డంకీ సినిమా డిసెంబర్ 21న రిలీజ్ లాక్ చేశారు. అయితే ఆ డేట్ కి వస్తుందా రాదా అన్న డౌట్ ఇప్పుడు మొదలైంది. ఎందుకంటే ప్రభాస్ సలార్ డిసెంబర్ 22న రిలీజ్ అవుతుంది. ప్రభాస్ సలార్ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా ఆ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు డిసెంబర్ 21 కి ముందే ఆక్వామెన్ వస్తున్నాడు. ఇది డంకీకి ఓవర్సీస్ లో దెబ్బ పడే అవకాశం ఉంది.

డిసెంబర్ 21న మిస్ అయితే డిసెంబర్ 25న రిలీజ్ చేయాలని చూస్తున్నారట డంకీ టీం. క్రిస్ మస్ లాంగ్ వీకెండ్ ని మిస్ అవ్వడం ఇష్టం లేదు కానీ అప్పటికే సలార్ 1 రిలీజ్ అవుతుంది కాబట్టి డంకీకి ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు. అందుకే డిసెంబర్ 21 లేదా 25 ఈ రెండు డేట్స్ లో డంకీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అంతకుముందు ప్రచార చిత్రాల్లో డంకీ 21న రిలీజ్ అని అనౌన్స్ చేశారు. కానీ దీపావళి టీజర్ లో మాత్రం రిలీజ్ డేట్ వేయలేదు.

సో సూపర్ స్టార్ సినిమా రిలీజ్ కన్ ఫ్యూజన్ కొనసాగుతూనే ఉందని చెప్పొచ్చు. ఆల్రెడీ ఈ ఇయర్ రెండు సూపర్ హిట్ కొట్టాడు కాబట్టి డంకీ సినిమా తో కూడా హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు షారుఖ్. అందుకే రిలీజ్ డేట్ విషయంలో ఈ కన్ ఫ్యూజన్ కొనసాగుతుంది. ప్రభాస్ సినిమాకు ముందు రావాలా లేదా తర్వాత రావాలా అన్నది ఆలోచిస్తున్నారు. డంకీ హిట్ పడితే పదేళ్లుగా షారుఖ్ ఫ్యాన్స్ ఆకలి తీరినట్టే అని చెప్పొచ్చు.

ఈ ఏడాది మొదట్లోనే పఠాన్ అంటూ వచ్చి ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ సూపర్ హిట్ కొట్టాడు షారుఖ్ ఇక రీసెంట్ గా వచ్చిన జవాన్ తో కూడా షారుఖ్ తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న షారుఖ్ డంకీని కూడా వాటి సరసన నిలబెట్టాలని చూస్తున్నాడు. షారుఖ్ ఖాన్ డంకీ రిలీజ్ ఎప్పుడైనా సరే రిజల్ట్ ని మాత్రం రిపీట్ చేయాలని చూస్తున్నారు షారుఖ్ ఖాన్.