Begin typing your search above and press return to search.

య‌ష్‌- షారూఖ్ రేర్ కాంబినేష‌న్?

కేజీఎఫ్ - కేజీఎఫ్ 2 చిత్రాల త‌ర్వాత క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ నుంచి ఇంత‌వ‌ర‌కూ సినిమా ఏదీ రాలేదు

By:  Tupaki Desk   |   5 Feb 2024 7:04 PM GMT
య‌ష్‌- షారూఖ్ రేర్ కాంబినేష‌న్?
X

కేజీఎఫ్ - కేజీఎఫ్ 2 చిత్రాల త‌ర్వాత క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ నుంచి ఇంత‌వ‌ర‌కూ సినిమా ఏదీ రాలేదు. అత‌డు చాలా కాలంగా డైల‌మాను కొన‌సాగించాడు. కానీ ఒకేసారి రెండు ప్రాజెక్టుల‌పై ప‌ని చేసాడు. ఇందులో టాక్సిక్ ఒక‌టి. డిసెంబర్ 2023 ప్రారంభంలో యష్ నటించిన 19వ చిత్రంగా టాక్సిక్ లుక్ ఆవిష్కరించారు. దీనికి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాకు మలయాళ దర్శకుడు గీతు మోహన్‌దాస్ ద‌ర్శ‌కుడు. తాజాగా ఈ సినిమాపై ఊహించ‌ని టాక్ అభిమానుల‌ను ఎగ్జ‌యిట్ చేస్తోంది.

ఆన్‌లైన్‌లో వ్యాపిస్తున్న పుకార్ల ప్ర‌కారం.. టాక్సిక్ సృష్టికర్తలు బాలీవుడ్ దిగ్గజం షారూఖ్ ఖాన్‌ను పొడిగించిన అతిధి పాత్ర కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనపై షారుఖ్ ఖాన్ స్పందన ఇంకా పెండింగ్‌లో ఉంది. యష్ - SRK అభిమానులు ఈ డైనమిక్ కాంబినేష‌న్ సాధ్య‌మ‌వుతుంద‌ని ఆశ‌గా ఉన్నారు. అయితే ఇవి కేవ‌లం పుకార్లేనా ఇందులో నిజం ఎంత‌? అన్న సందేహాలున్నాయి.

కేజీఎఫ్ లో శ్రీ‌నిధి శెట్టి క‌థానాయిక‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. శ్రీ‌నిధితో య‌ష్ రొమాన్స్ ఒక లెవ‌ల్లో పండింది. ఇప్పుడు టాక్సిక్ కోసం హీరోయిన్ ని వెతుకుతున్నార‌ని, ఈ పాత్ర కోసం వివిధ నటీమణుల పేర్లు ప‌రిశీలించార‌ని ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే ఈ ఊహాగానాలకు మేకర్స్ నుండి అధికారిక ధృవీకరణ రాలేదు. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ ఈ భారీ యాక్ష‌న్ చిత్రాన్ని నిర్మించారు. టాక్సిక్ 10 ఏప్రిల్ 2025న థియేట్రికల్ గా రిలీజ్ కానుంది. ఒక సంవ‌త్స‌రం త‌ర్వాతే య‌ష్ నుంచి ట్రీట్ ఉంటుంద‌న్న‌మాట‌. ఈలోగానే అత‌డు నితీష్ తివారీ రామాయ‌ణంలో రావ‌ణుడి పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు ఓ మ‌హిళా ద‌ర్శ‌కురాలితోను క‌లిసి ప‌ని చేయ‌నున్నాడ‌ని క‌థ‌నాలొచ్చాయి.