Begin typing your search above and press return to search.

స్టార్ హీరో సెంటిమెంట్ ని ప‌క్క‌న‌బెట్టేసాడు!

`ప‌ఠాన్`..`జ‌వాన్` విజ‌యాల‌తో స్వింగ్ మీదున్న షారుక్ ఖాన్ ని `డంకీ` ఫ‌లితం కాస్త నిరుత్సాహ ప‌రించింది.

By:  Tupaki Desk   |   24 Dec 2023 11:30 AM GMT
స్టార్ హీరో సెంటిమెంట్ ని ప‌క్క‌న‌బెట్టేసాడు!
X

`ప‌ఠాన్`..`జ‌వాన్` విజ‌యాల‌తో స్వింగ్ మీదున్న షారుక్ ఖాన్ ని `డంకీ` ఫ‌లితం కాస్త నిరుత్సాహ ప‌రించింది. `డంకీ` కూడా విజ‌యం సాధిస్తే హ్యాట్రిక్ న‌మోద‌య్యేది. కానీ జ‌స్ట్ మిస్ త‌ప్ప‌లేదు. అయినా రెండు భారీ బ్లాక్ బ‌స్ట‌ర్లు ముందు ఒక్క ప్లాప్ లెక్క‌లోకి రానిది. అయితే ప్లాప్ త‌ర్వాత విరామం తీసుకోవ‌డం అన్న‌ది షారుక్ ఖాన్ చాలా కాలంగా సెంటిమెంట్ గా భావిస్తున్నారు. కానీ ఈసారి ఎదురైంది ఒక ప్లాప్ చిత్ర‌మే కావ‌డంతో విరామం తీసుకోకుండా ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్నారు.

స‌క్సెస్ ఉత్సాహంలో కొత్త ప్రాజెక్ట్ ప్ర‌క‌టించి అభిమాను ల్ని స‌ర్ ప్రైజ్ చేసారు. వ‌చ్చే ఏడాది మార్చిలో కొత్త సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈసారి కొత్త ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు..త‌న వయ‌సుకు త‌గ్గ పాత్ర చేస్తున్న ట్లు రివీల్ చేసారు. ఆప్ర‌య‌త్నం త‌ప్ప‌క ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంద‌ని` అన్నారు. అయితే ఆ సినిమాకి ద‌ర్శ‌కుడు ఎవ‌రు? ఎలాంటి క‌థాంశం? హీరోయిన్ త‌దిత‌ర వివ‌రాలు మాత్రం గోప్యంగా ఉంచారు.

వాటిని కొత్త ఏడాది ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అయితే ఇప్ప‌టికే షారుక్ ఖాన్-విజ‌య్ ల‌తో ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కిస్తున్న‌ట్లు అట్లీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ కాంబినేష‌న్ కి త‌గ్గ స్టోరీ రెడీ చేస్తున్న‌ట్లు రివీల్ చేసారు. ఈ నేప‌థ్యంలో షారుక్ ప్ర‌క‌ట‌న అభిమానుల్ని క‌న్ ప్యూజ‌న్ లో ప‌డేసింది. షారుక్ చేయ‌బోయేది అట్లీతోనా? లేక అది స‌ప‌రేట్ ప్రాజెక్ట్ నా? అన్న సందేహం అభిమానుల్లో మొద‌లైంది.

వ‌య‌సుకు త‌గ్గ పాత్ర అని హింట్ ఇవ్వ‌డంతో ఇది వేరే ప్రాజెక్ట్ అని ..బాలీవుడ్ మేక‌ర్ తో చేసే ప్లాన్ లో భాగంగానే ఆ ర‌క‌మైన ప్ర‌క‌ట‌న ఇచ్చి ఉండొచ్చ‌ని కొంత మంది అభిమానులు భావిస్తున్నారు. మ‌రి ఇందులో వాస్త‌వాలు ఏంటి? అన్న‌ది షారుక్ ఖాన్ క్లారిటీ ఇస్తే గానీ తెలియ‌దు.