Begin typing your search above and press return to search.

షారుక్-కాజోల్ జోడీ మ‌ళ్లీ హిట్టే!

షో అనంత‌రం ఇద్ద‌రు మీడియా లో హైలైట్ అయ్యారు. కాజోల్ ఎంతో సంతోషంగా న‌వ్వుతూ ఉండ‌గా.. ఆమెవైపు షారుక్ అలా చూస్తూ ఉండిపోయారు.

By:  Tupaki Desk   |   7 Dec 2023 11:30 AM GMT
షారుక్-కాజోల్ జోడీ మ‌ళ్లీ హిట్టే!
X

బాలీవుడ్ సూప‌ర్ జోడీ షారుక్ ఖాన్-కాజోల్ అగర్వాల్ ఒకేచోట క‌నిపిస్తే అభిమానుల్లో ఉత్సాహం ఉర‌క లేస్తుంది. ఆన్ ది స్క్రీన్ అయినా..ఆఫ్ ది స్క్రీన్అయినా ఆ జోడీని ఎంత‌సేపైనా అలా చూస్తూ ఉండాలని పిస్తుంది. తాజాగా ఈ జోడీ మ‌రోసారి ది ఆర్చిస్ స్క్రీనింగ్ సంద‌ర్భంగా నిన్న‌టి రోజున ఒకే చోట క‌నిపించి అభిమానుల్ని అల‌రించారు. కాజోల్ అందంగా ముస్తాబై షోకి హాజ‌ర‌య్యారు. అలాగే షారుక్ ఖాన్ కూడా అదే షోకి విచ్చేసారు.


షో అనంత‌రం ఇద్ద‌రు మీడియా లో హైలైట్ అయ్యారు. కాజోల్ ఎంతో సంతోషంగా న‌వ్వుతూ ఉండ‌గా.. ఆమెవైపు షారుక్ అలా చూస్తూ ఉండిపోయారు. ఈ అరుదైన స‌న్నివేశం గ‌త‌రాత్రి చోటు చేసుకుంది. బాలీవుడ్ స్టార్ కిడ్స్ న‌టించిన `ది ఆర్చీస్` రిలీజ్ సంద‌ర్భంగా సెల‌బ్రిటీలంతా ఈ షోకి హాజ‌ర‌య్యారు. ఎంత‌మంది జోడీలు అక్క‌డికి విచ్చేసినా షారుక్-కాజోల్ జంట మాత్రం సంథింగ్ స్పెష‌ల్ గా హైలైట్ అయింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. అభిమానులు ఆ జోడీని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.


షారుక్-కాజోల్ కాంబినేష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. `దిల్‌‌‌‌వాలే దుల్హనియా లేజాయేంగే`..` కుచ్‌‌‌‌ కుచ్ హోతా హై`.. `కభీ ఖుషీ కభీ ఘమ్` లాంటి సూపర్‌‌‌‌‌‌‌‌ హిట్ సినిమాల్లో నటించి బెస్ట్ పెయిర్‌‌‌‌‌‌‌‌గా నిలి చారు. ఆ సినిమాల్లో ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ వ‌ర్కౌట్ అయిన విధానం ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. ఆ చిత్రాలు ఎప్ప‌టికీ వండ‌రే అనే చెప్పాలి. అందుకే దశాబ్ధాల త‌ర్వాత `దిల్ వాలే` తో మ‌రోసారి ఆ స‌క్సెస్ పుల్ కాంబినేష‌న్ చేతులు క‌లిపింది.


భారీ అంచ‌నాల మ‌ద్య రిలీజ్ అయిన `దిల్ వాలే` మాత్రం అంచ‌నాలు అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. ఆనాటి `దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే` ఫీల్ ని తీసుకు రాలేక‌పోయింది. కానీ షారుక్-కాజోల్ జోడీని తెర‌పై చూడ‌టం ప‌ట్ల అభిమానులు సంతోషం వ్య‌క్తం చేసారు. మ‌ళ్లీ ఆ జోడీని చూస్తామా? మిస్ అయిపోతామా? అని ఒక్క‌సారైనా చూడాలని థియేట‌ర్ కి వెళ్లిన అభిమానులెంతో మంది.