Begin typing your search above and press return to search.

షరతులు వర్తిస్తాయి ట్రైలర్ టాక్.. మరో మిడిల్ క్లాస్ కథ!

ఇక ఈ దేశంలో ఉన్న 80% సామాన్యుల కథనే మన ఈ సినిమా అంటూ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు.

By:  Tupaki Desk   |   4 March 2024 10:50 AM GMT
షరతులు వర్తిస్తాయి ట్రైలర్ టాక్.. మరో మిడిల్ క్లాస్ కథ!
X

30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపును అందుకున్న చైతన్యరావు ఆ తర్వాత చిన్న బడ్జెట్ లోనే డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. ఇక ఇప్పుడు అతని నుంచి రాబోతున్న మరో ప్రయోగాత్మకమైన చిత్రం షరతులు వర్తిస్తాయి. ఈ సినిమా టైటిల్ తోనే ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ దేశంలో ఉన్న 80% సామాన్యుల కథనే మన ఈ సినిమా అంటూ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు.


ట్రైలర్ విషయానికి వస్తే.. కోరికలే మనిషి దుఃఖానికి మూలం.. అనే గౌతమి బుద్ధుడి కొటేషన్ తో మొదలైన ట్రైలర్ మధ్యతరగతి ఫ్యామిలీకి సంబంధించిన చాలా అంశాలను హైలెట్ చేశారు. మొత్తానికి హీరో కఠినమైన పరిస్థితులను దాటి పెళ్లి చేసుకున్న తర్వాత ఊహించిన విధంగా ఒక బిజినెస్ లో డబ్బులు వస్తాయని ఆశపడి అటువైపు అడుగులు వేయడం అతనితో పాటు మరి కొంత మంది అదే బాటలో నడవడం ఊహించని పరిణామాలకు దారి తీస్తుంది.

కుటుంబంలో గొడవలు ఆ తర్వాత న్యాయం కోసం ప్రయత్నం చేయడం వంటి కథనంతో సినిమా రూపొందినట్లు అర్ధమవుతోంది. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఉండే అనుభవాలు ఈ ట్రైలర్లో కనిపిస్తూ ఉన్నాయి. అంతే కాకుండా కామెడీ సీన్స్ కూడా ఇందులో హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. చిన్న తరహా క్యాస్టింగ్ అయినప్పటికీ కూడా చాలా నేచురల్ గా ఉండేలా దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నాడు.

ఇక సినిమాలో చైతన్యకు జోడిగా భూమి శెట్టి నటిస్తోంది. నందకిషోర్ సంతోష్ యాదవ్ దేవరాజ్ జబర్దస్త్ వెంకీ వంటి వారు సినిమాలో ముఖ్యమైన పాత్రలలో నటించారు. అక్షర దర్శకత్వం వహించిన ఈ సినిమాను నాగార్జున సామల నిర్మించారు. ఇక వరల్డ్ వైడ్ గా షరతులు వర్తిస్తాయి సినిమాను మార్చి 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు.

మొత్తానికి సినిమా ట్రైలర్ తోనే మధ్యతరగతి కుటుంబానికి కనెక్ట్ అయ్యేలా చేసిన చిత్ర యూనిట్ మిగతా ప్రమోషన్స్ తో కూడా జనాలకు మరింత చేరువయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకొని తన రేంజ్ పెంచుకోవాలని చైతన్య ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నాడు. మరో సినిమా ఆడియన్స్ కు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.