Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : శర్మ సిస్టర్స్ అందాల షో

రామ్‌ చరణ్ హీరోగా పరిచయం అయిన చిరుత సినిమాతోనే నేహా శర్మ హీరోయిన్‌ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   12 March 2024 12:16 PM GMT
పిక్ టాక్ : శర్మ సిస్టర్స్ అందాల షో
X

రామ్‌ చరణ్ హీరోగా పరిచయం అయిన చిరుత సినిమాతోనే నేహా శర్మ హీరోయిన్‌ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెల్సిందే. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు దక్కించుకున్న ముద్దుగుమ్మ నేహా శర్మ కి ఆ తర్వాత టాలీవుడ్‌ లో ఆశించిన స్థాయిలో ఆఫర్లు దక్కలేదు.

టాలీవుడ్‌ లో పెద్దగా ఆఫర్లు రాకున్నా కూడా ఇతర భాషల ఇండస్ట్రీలో ఈ అమ్మడు మెల్ల మెల్లగా ఆఫర్లు దక్కించుకుంటూ బిజీ అయ్యింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా ఏళ్లు అయినా కూడా ఈ అమ్మడి యొక్క అందం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికి కూడా నెట్టింట నేహా పిక్స్ వైరల్‌ అవుతూనే ఉంటాయి.

నేహా శర్మ యొక్క సోదరి ఐషా శర్మ కూడా అందాల ఆరబోత ఫోటోలతో నెట్టింట తెగ వైరల్‌ అవుతూ ఉంటుంది. అక్కకి ఏ మాత్రం తక్కువ కాదు అన్నట్టు చెల్లి ఐషా కూడా అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ శర్మ సిస్టర్స్‌ పిక్ ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఫ్యాన్స్ ఈ ఫోటోలను తెగ షేర్‌ చేస్తూ ఈ సిస్టర్స్ ని ట్రెండ్‌ చేస్తున్నారు. ఐషా అందం కు ఇప్పటికే పెద్ద హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు రావాల్సి ఉంది. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో అవకాశాలు దక్కడం లేదు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ పిక్‌ లో శర్మ సిస్టర్స్ క్లీ వేజ్ షో తో చూపు తిప్పుకోనివ్వడం లేదు. అందం విషయంలో ఈ సిస్టర్స్ తర్వాతే ఎవరైనా అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అంటూ ఈ పిక్స్ చూస్తూ ఉంటే అనిపిస్తోందని నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.