Begin typing your search above and press return to search.

చిట‌పట చినుకులు ప‌డుతూ ఉంటే..!

అలా గాలికి ఎగిరి తుంప‌ర్లు మీద ప‌డుతుంటే ఆ హాయిని ఆస్వాధిస్తూనే ఒక‌వైపు గొడుగులో పూర్తిగా త‌డ‌వ‌కుండా స్కిప్ కొడుతున్నారు శ‌ర్మా సిస్ట‌ర్స్

By:  Tupaki Desk   |   21 Aug 2023 3:46 AM GMT
చిట‌పట చినుకులు ప‌డుతూ ఉంటే..!
X

చిటపట చినుకులు పడుతూ ఉంటే..చెలికాడె సరసన ఉంటే..

చెట్టాపట్టగ చేతులు పట్టి..చెట్టు నీడకై పరుగిడుతుంటే...

చెప్పలేని ఆ హాయి..ఎంతో వెచ్చగ ఉంటుందోయీ

చెప్పలేని ఆ హాయి..ఎంతో వెచ్చగ ఉంటుందోయీ..


1964 క్లాసిక్ మూవీ 'ఆత్మబలం'లోనిది ఈ పాట‌. ఆచార్య ఆత్రేయ సాహిత్యం అందించ‌గా కె.వి. మహదేవన్ సంగీతం అందించారు. ఘంటసాల, సుశీల ఈ పాట‌ను ఆల‌పించారు. అయితే ఈ పాట‌ను ఇప్పుడే గుర్తు చేసుకోవ‌డానికి కార‌ణం ఇదిగో ఇక్క‌డ అంద‌మైన పాపాయిలు అలా గొడుగు పట్టుకుని చిట‌ప‌ట‌చినుకుల్లో క‌వ్విస్తున్న తీరు అంత ఇదిగా ఉంది.

ముంబైలో అస‌లే మాన్ సూన్ సీజ‌న్‌. అలా గాలికి ఎగిరి తుంప‌ర్లు మీద ప‌డుతుంటే ఆ హాయిని ఆస్వాధిస్తూనే ఒక‌వైపు గొడుగులో పూర్తిగా త‌డ‌వ‌కుండా స్కిప్ కొడుతున్నారు శ‌ర్మా సిస్ట‌ర్స్. ఇంత‌లోనే త‌మను వెంబ‌డించిన కెమెరాకు ఇలా ఫోజులిచ్చారు. నేహా శ‌ర్మ‌- ఐషా శ‌ర్మ ఆ ఇద్ద‌రూ క‌లిసి ఫోజులివ్వ‌డం ఇదే తొలిసారి కాదు.. ప్ర‌తిసారీ జిమ్ కి వెళ్లి వ‌స్తూ ఇలా కెమెరా కంటికి చిక్కుతుంటారు. ఇప్పుడు కూడా నేహాశ‌ర్మ బిగి అందాల‌ను కెమెరా ముందు ప‌సందుగా ఆవిష్క‌రించ‌గా.. ఐషా చిట్టి పొట్టి నిక్క‌రులో వేడి పెంచుతోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వస్తే.. నేహాశ‌ర్మ ఇటీవ‌ల మ‌ళ్లీ జీరో అయిపోయింది. గత ఏడాది జోగిర సారా రారా అనే చిత్రంలో న‌టించింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ కొత్త ప్రాజెక్టుకు క‌మిటైన‌ట్టు లేదు. మ‌రోవైపు ఐషా శ‌ర్మ ఈ నాలుగేళ్ల‌లో నటించింది ఒకే ఒక్క సినిమా. స‌త్య‌మేవ జ‌య‌తే చిత్రంలో న‌టించింది. కానీ ఆ త‌ర్వాత అవ‌కాశాలే లేవు. అక్క నేహాతో క‌లిసి షైనింగ్ విత్ శ‌ర్మాస్ డిజిట‌ల్ షో మిన‌హా ఇక వేరే ఆప్ష‌న్స్ ఏవీ ఈ భామ‌ల‌కు క‌నిపించ‌డం లేదు. సోష‌ల్ మీడియా ఫోటోషూట్ల‌తో యాడ్ షూట్ల‌తో కాల‌క్షేపం చేస్తున్నారు.