Begin typing your search above and press return to search.

దుబాయ్‌లో శ‌ర్మా గాళ్స్‌ హంగామా చూసారా?

సిస్ట‌ర్స్ ఇద్ద‌రూ దుబాయ్ లోని ఆకాశ హార్మ్యాల న‌డుమ ఫుల్ గా పార్టీల‌తో చిల్ చేసారు. క‌లిసి డిన్న‌ర్ లు చేసారు. స్పెష‌ల్ ఎన్వీ పార్టీల‌తో టేస్టీ ఫుడ్ ని ఆస్వాధించారు.

By:  Tupaki Desk   |   23 Nov 2023 3:08 PM GMT
దుబాయ్‌లో శ‌ర్మా గాళ్స్‌ హంగామా చూసారా?
X

శ‌ర్మా సిస్ట‌ర్స్ ఎక్క‌డ ఉన్నా అక్క‌డ ఒక‌టే సంద‌డి. బాల‌య్య అన్ స్టాప‌బుల్ లా శ‌ర్మా సిస్ట‌ర్స్ అన్ స్టాప‌బుల్ ఎంట‌ర్ టైన్ మెంట్ యూత్ ని అదే ప‌నిగా క‌వ్విస్తుంది. బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ కి వెళ్లినా లేదా జిమ్ లో హొయ‌లు పోయినా, ఇంకేదైనా పార్టీలో చిల్ చేసినా శ‌ర్మా సిస్ట‌ర్స్ ల‌క్ష్యం గ‌గ్గోలు పెట్టించ‌డం.


ఇదిగో ఇప్పుడు కూడా అలాంటి దిన‌చ‌ర్య‌తో బోయ్స్ గుండెల్లో తిష్ఠ వేసారు. త‌న సోద‌రి నేహా శ‌ర్మ బ‌ర్త్ డే వేడుక‌ల సంద‌ర్భంగా ఐషా శ‌ర్మ చేసిన సంద‌డి అంతా ఇంతా కాద‌ని తాజాగా లీకైన సోష‌ల్ మీడియా వీడియోలు ఫోటోలు వెల్ల‌డిస్తున్నాయి. సిస్ట‌ర్స్ ఇద్ద‌రూ దుబాయ్ లోని ఆకాశ హార్మ్యాల న‌డుమ ఫుల్ గా పార్టీల‌తో చిల్ చేసారు. క‌లిసి డిన్న‌ర్ లు చేసారు. స్పెష‌ల్ ఎన్వీ పార్టీల‌తో టేస్టీ ఫుడ్ ని ఆస్వాధించారు.


పుట్టినరోజులు ప్రియమైన వారిని ప్రత్యేకంగా భావించేలా చేస్తాయి. అక్క బ‌ర్త్ డే కోసం చెల్లి ఐషా శ‌ర్మ ఎంతో గ్రాండ్ గా ఈ పార్టీల‌ను ఎరేంజ్ చేసింద‌ని కూడా అర్థ‌మ‌వుతోంది. ఐషా తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోల బండిల్‌ను షేర్ చేసింది. తన సోదరి కోసం ఎమోషనల్ నోట్‌ను కూడా రాసింది. నోట్‌లో ఇలా ఉంది, "పుట్టినరోజు పోస్ట్‌లు వ్యక్తులు సోషల్ మీడియాలో చదివే రకమైన పోస్ట్‌లు కానే కాదు. ఇవి బంధాన్ని అర్థంచేసుకోవడానికి ప్రయత్నించేవి. భాగస్వాములు, సోదరీమణులు, స్నేహితుల మధ్య బంధం ఏదైనా కావచ్చు. కానీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఎవరికైనా నిజంగా బంధం అంటే ఏమిటో అర్థం చేసుకోవడంలో సహాయపడదు. కనీసం నా సోదరి & నా విషయానికి వస్తే చాలా విభిన్న‌మైన‌ది" అని అంత‌రార్థం ప్ర‌తిధ్వ‌నించేలా వ్యాఖ్యానాన్ని జోడించింది. "నీకు నిజంగా నేహా తెలుసు తప్ప, నేహాని నిజంగా తెలుసుకోలేవు. ఆమె ఎంతో మంచిగా పోషించే అమ్మాయి.. సానుభూతి, సున్నితత్వం.. నిజంగా ప్రేమించడం ఎలాగో తెలిసిన వ్యక్తి & నా అభిప్రాయం ప్రకారం.. ఒకరు ఎలా ప్రేమిస్తారనే గుణమే ఒక వ్యక్తి లో చూడ‌గ‌లిగే గొప్ప లక్షణం. నేహా ఎవ్వరినీ ప్రేమించలేదు.. గొప్ప లొంగని ఆత్మ .. సంకల్పం ఉన్న వ్యక్తి .పుట్టినరోజు శుభాకాంక్షలు నేహా . నీవు స్వేచ్ఛగా ఇచ్చే ప్రేమ, ఈ పుట్టినరోజు సంవత్సరంలో ప్రతి రోజూ అనేక రెట్లు తిరిగి నీకోసం వస్తుందని నేను ఆశిస్తున్నాను" అని తెలిపింది.


ఫోటోలలో, నేహా - ఐషా రేసీ బ్రాలెట్ లు ప్యాంట్‌లలో క‌వ్వించే లుక్ తో కనిపించారు. పుట్టినరోజు వేడుక‌ల్లో నేహా శాటిన్ ఎల్లో బాడీకాన్ డ్రెస్‌లో అందంగా కనిపించగా, మరోవైపు ఐషా శాటిన్ పూల దుస్తులలో ఆకర్షణీయంగా కనిపించింది. నేహా శర్మ -ఐషా శర్మ బాలీవుడ్‌లో అత్యంత ఆకర్షణీయమైన ఫిట్టెస్ట్ సోదరీమ‌ణులుగా సుప్ర‌సిద్ధులు. ఇద్దరు భామ‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో రేసీ స్నాప్ లేదా వీడియోను షేర్ చేసిన ప్రతిసారీ ఇంటర్నెట్ లో సునామీ పుట్టుకు రావ‌డం గ్యారెంటీ.


నేహా శర్మ క్రూక్, తుమ్ బిన్, యమ్లా పగ్లా దీవానా 2, యంగిస్తాన్, క్యా సూపర్ కూల్ హై హమ్- తాన్హాజీ వంటి చిత్రాలలో నటించింది. చివరిగా జోగిర సారా రాలో నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి నటించింది. ఈ చిత్రంలో సంజయ్ మిశ్రా - మహాక్షయ్ చక్రవర్తి కూడా కీలక పాత్రలు పోషించారు. నేహా చెల్లెలు ఐషా శర్మ కూడా క‌థానాయిక‌గా అవ‌కాశాలు అందుకుంటోంది.