Begin typing your search above and press return to search.

శర్మ సిస్టర్స్ బికినీ ట్రీట్.. హీటెక్కించే కోల్డ్ చాలెంజ్లు

తాజాగా నేహా శర్మ, ఆయెషా శర్మ హాట్ కాస్ట్యూమ్స్ లో అదిరిపోయే సాహసం చేశారు

By:  Tupaki Desk   |   7 Aug 2023 10:27 AM GMT
శర్మ సిస్టర్స్ బికినీ ట్రీట్.. హీటెక్కించే కోల్డ్ చాలెంజ్లు
X

చిరుత సినిమాతో హీరోయిన్ గా నటించిన నేహా శర్మని అంత వేగంగా ఎవరూ మరిచిపోరు. తెలుగులో రెండు సినిమాలకే పరిమితం అయిన ఈ ముద్దుగుమ్మ తరువాత హిందీలో ఎదిగే ప్రయత్నం చేసింది. అక్కడ కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చింది. ఆశించిన స్థాయిలో స్టార్ హీరోయిన్ రేంజ్ గుర్తింపు మాత్రం నేహా శర్మ సొంతం చేసుకోలేదు. ఇక ఈ బ్యూటీ సిస్టర్ ఆయెషా శర్మ కూడా హీరోయిన్ గా హిందీలోకి అడుగుపెట్టిన జాన్ అబ్రహంకి జోడీగా జనగణనమన మూవీలో నటించింది.

ప్రస్తుతం ఈ బ్యూటీస్ చేతిలో చెప్పుకోదగ్గ అవకాశాలు అయితే లేవు. అయితే ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లకి సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో ఈ బ్యూటీస్ చాలా యాక్టివ్ గా ఉంటూ వారికి సంబందించిన ప్రతి దినచర్యని షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే అప్పుడప్పుడు హాట్ ఫోటోలతో సందడి చేస్తూ ఉంటారు. ఈ కారణంగా బ్యూటీస్ కి ఫాలోవర్స్ చాలా ఎక్కువ ఉన్నారు.

నేహా శర్మని ఇన్ స్టాగ్రామ్ లో 17.6 మిలియన్స్ మంది ఫాలో అవుతూ ఉంటారు. అందుకే ఈమె పెట్టే ఫోటోలు, వీడియోలకి లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఆయెషా శర్మకి కూడా ఐదు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఈ అక్కాచెల్లెళ్లు చేసే అందాల ప్రదర్శనకి హద్దే ఉండదు.

ఎలాంటి సంకోచం లేకుండా అందాల ప్రదర్శనతో కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు జిమ్ లో వర్క్ అవుట్ వీడియోలని కూడా ఈ ముద్దుగుమ్మలు పంచుకుంటారు. తాజాగా నేహా శర్మ, ఆయెషా శర్మ హాట్ కాస్ట్యూమ్స్ లో అదిరిపోయే సాహసం చేశారు. మైనస్ డిగ్రీలో ఉండే ఐస్ వాటర్ లో దిగారు.

బాడీ ఫిట్ నెస్ వర్క్ అవుట్ లలో అది కూడా ఒకటి నేహా శర్మ రెడ్ కలర్ సింగిల్ పీస్ బికినీలో ఎద అందాలు చూపిస్తూ ఐస్ వాటర్ లో దిగింది. ఈ వీడియోని ఏకంగా 7.46 లక్షల మంది లైక్ చేశారు. అలాగే ఆయెషా శర్మ కూడా జిమ్ లో వర్క్ అవుట్ చేసిన అనంతరం ఇలా కోల్డ్ వాటర్ బాత్ చేసింది. ఈ వీడియోని 46.5 వేల మంది లైక్ చేశారు. ఈ రెండు వీడియోలు ఇప్పుడుసోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కాచెల్లెళ్లు అందాల ప్రదర్శనలో గాని, ఇలా అదిరిపోయే సాహసాలు చేయడంలో గాని ముందుంటారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.