Begin typing your search above and press return to search.

బీచ్ రిసార్ట్‌లో చెల‌రేగిపోయిన శ‌ర్మా గాళ్

ఇదే వీడియోలో ఆమె పర్యటన నుండి సుందరమైన ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   27 Jan 2024 5:07 PM GMT
బీచ్ రిసార్ట్‌లో చెల‌రేగిపోయిన శ‌ర్మా గాళ్
X

బాలీవుడ్ బ్యూటీ నేహా శర్మ నిరంత‌ర సోష‌ల్ మీడియా ట్రీట్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇప్పుడు శ్రీలంక పర్యటన నుండి ఒక వీడియోను ఇన్ స్టాలో అభిమానుల కోసం షేర్ చేసింది. ఈ వీడియోలో నేహా టీ సిప్ చేస్తూ క‌నిపించింది. ఇదే వీడియోలో ఆమె పర్యటన నుండి సుందరమైన ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయి. పోస్ట్‌ను షేర్ చేస్తూ ``టీ సిప్ చేయండి, విశ్రాంతి తీసుకోండి.. రిపీట్ చేయండి`` అని క్యాప్షన్‌లో రాసింది.

అంతకుముందు షేర్ చేసిన ఫోటోల్లో నేహా శర్మ శ్రీలంకలోని అమన్‌వెల్లా రిసార్ట్‌లో విహారయాత్రను ఆస్వాధిస్తూ క‌నిపించింది. నేహా చిక్ పింక్ అండ్ వైట్ డిజైన‌ర్ దుస్తులు.. బ్యాక్‌డ్రాప్‌గా సముద్రపు దృశ్యంతో అల్పాహారాన్ని ఆస్వాధిస్తూ క‌నిపించింది. ఎంతో ఆకర్షణీయమైన ఫోటోలను షేర్ చేయ‌డ‌మే కాదు.. నేహా తన ఫాలోయర్‌లను మంత్రముగ్దులను చేసే వీడియోను షేర్ చేసింది.

నేహా స్పీడ్ చూస్తుంటే తిరిగి ఈ బ్యూటీకి చ‌ర‌ణ్ అవ‌కాశం ఇస్తాడ‌నే హోప్ పెరుగుతోంది. నేహా చివ‌రిగా శ్రీలంకలో ఆమె చేసిన ఆకర్షణీయమైన సాహసాల గురించిన‌ పోస్ట‌ర్లు వెబ్ లోకి వచ్చాయి. మునుముందు తెలుగు చిత్ర‌సీమ‌లోను తిరిగి న‌టించాలని ఈ బ్యూటీ ప్లాన్ చేస్తోంది.