Begin typing your search above and press return to search.

వీడియో : బాబోయ్ ఆ తిప్పుడు ఏంటి అమ్మడు!

ఈ రేంజ్ లో కర్ర సాము చేస్తే ముందు ముందు సినిమాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఈమెతో చేయిస్తారేమో అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 Sep 2023 6:35 AM GMT
వీడియో : బాబోయ్ ఆ తిప్పుడు ఏంటి అమ్మడు!
X

లవ్లీ, అడ్డా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శాన్వీ శ్రీవాస్తవ. ఈ అమ్మడు టాలీవుడ్ లో ఆశించిన స్థాయి లో విజయాలను సొంతం చేసుకోలేక పోయింది. దాంతో కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఈ అమ్మడు అడుగు పెట్టి అక్కడ వరుస సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుని విజయాలు సొంతం చేసుకుంది.

ఈ మధ్య కాలంలో తెలుగు లో పెద్దగా సినిమాలు చేయక పోయినా కూడా తెలుగు ప్రేక్షకులు ఈమె ఫోటో షూట్స్ కారణంగా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. తాజాగా మరోసారి శాన్వీ శ్రీవాస్తవ సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈసారి ఫోటోలతో కాకుండా ఒక వీడియో ని షేర్ చేసి సర్ ప్రైజ్ చేసింది. సాధారణంగా ఆడవారు చాలా సుకుమారులు అనే టాక్ ఉంది. కానీ ఈ వీడియో చూసిన తర్వాత ఆడవారిలో శాన్వీ శ్రీవాస్తవ చాలా స్పెషల్ అన్నట్టు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే కర్ర సాముతో అబ్బుర పరచడంతో పాటు కళ్లు పెద్దవి గా చేసుకుని మరీ చూసే విధంగా సర్‌ ప్రైజ్ చేసింది.

చాలా మంది ఈ వీడియోను చూసి బాబోయ్ ఏంటి ఆ తిప్పుడు అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. ఈ రేంజ్ లో కర్ర సాము చేస్తే ముందు ముందు సినిమాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఈమెతో చేయిస్తారేమో అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హాట్ ఫోటో షూట్స్ తో మాత్రమే కాదు ఇలాంటి యాక్షన్‌ వీడియోలతో కూడా శాన్వీ శ్రీవాస్తవ వైరల్‌ అవ్వడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.