Begin typing your search above and press return to search.

శాన్వి గోల్డెన్ గ్లామర్ షో.. స్టన్నింగ్!

టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంటున్న బ్యూటీ శాన్వి శ్రీవస్తవ, తాజాగా తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చారు.

By:  Tupaki Desk   |   16 July 2025 11:13 PM IST
శాన్వి గోల్డెన్ గ్లామర్ షో.. స్టన్నింగ్!
X

టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంటున్న బ్యూటీ శాన్వి శ్రీవస్తవ, తాజాగా తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చారు. ఓవ్వా ఓవ్వా అంటూ క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. గోల్డెన్ డీప్ నెక్ గౌన్ డ్రెస్‌లో స్టన్నింగ్ లుక్స్‌తో దర్శనమిచ్చిన శాన్వి, తన గ్లామర్ స్టేట్‌మెంట్‌ని మరోసారి నిలబెట్టుకుంది.

సాఫ్ట్ లైటింగ్‌లో తీసిన ఈ క్లాస్ గ్లామరస్ పిక్స్‌కి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఓవర్ నైట్ స్టార్స్‌తో పోలిస్తే.. శాన్వి శ్రీ కష్టపడి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. మొదట మోడలింగ్‌తో కెరీర్ స్టార్ట్ చేసి, సినిమా ప్రపంచంలో అడుగుపెట్టి లవ్లీ, అడ్డా, రౌడి వంటి ప్రాజెక్ట్స్‌లో తన నటనతో ఆకట్టుకున్నారు.

తెలుగు ఆడియన్స్‌కి ఈ పేరుతో పరిచయం అయినా.. శాన్వి అసలు పేరు శాన్వి శ్రీవాస్తవ. సూపర్ గ్లామరస్‌గా కనిపించే ఈ బ్యూటీకి పర్‌ఫార్మెన్స్ టచ్ కూడా ఉందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో శాన్వి పోస్ట్ చేసే ఫోటోషూట్లు ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. ప్రత్యేకంగా లైట్ ఎఫెక్ట్స్, స్టైలిష్ డ్రెస్ సెలెక్షన్, బోల్డ్ కాన్ఫిడెన్స్‌కి ఆమెకు మంచి మార్కులే పడుతున్నాయి.

తాజా ఫోటోసెట్‌కి ‘ఓవ్వా ఓవ్వా’ అంటూ క్యాప్షన్ పెట్టిన ఆమె, ప్రతి ఫ్రేమ్‌లోనూ ఓ డిఫరెంట్ మూడ్ చూపిస్తూ ఫోటోగ్రఫీకి ఆర్టిస్ట్‌యిరీని జోడించింది. ఫ్యాషన్ మాగజైన్లలో కనిపించే లెవెల్‌లో ఈ ఫోటోస్ ఉండటంతో, నెటిజన్లు ఇది సినిమా పోస్టరా లేక మ్యాగజైన్ కవరా.. అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక చివరగా ఆమె తెలుగులో ప్యార్ మే పడిపోయా అనే సినిమాలో కనిపించింది. ఆ తరువాత ఎక్కువగా కన్నడ ఇండస్ట్రీలోనే సినిమాలు చేస్తూ వస్తోంది.