Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : భర్త జ్ఞాపకార్థం.. గుండులో ప్రముఖ నటి

ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా మూడు లక్షల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఈమె ఇటీవల గుండుతో ఉన్న ఫోటోలను షేర్‌ చేసి సర్‌ప్రైజ్ చేసింది.

By:  Tupaki Desk   |   11 April 2025 4:15 PM IST
పిక్‌టాక్‌ : భర్త జ్ఞాపకార్థం.. గుండులో ప్రముఖ నటి
X

తెలుగు ప్రేక్షకులకు భానుప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె నటిగా సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఒకప్పుడు హీరోయిన్‌గా స్టార్‌ హీరోలకు జోడీగా నటించిన భానుప్రియ ఈ మధ్య కాలంలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. భానుప్రియ సోదరి శాంతిప్రియ. ఈమె కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. నటిగా పలు సినిమాలు చేసినప్పటికీ భానుప్రియ స్థాయిలో గుర్తింపు దక్కలేదు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ ఈమె సినిమాలు చేసిన విషయం తెల్సిందే. ఈమె సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా ఫోటోలను, వీడియోలను షేర్‌ చేయడం ద్వారా అభిమానులకు చేరువగా ఉంటుంది.


ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా మూడు లక్షల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఈమె ఇటీవల గుండుతో ఉన్న ఫోటోలను షేర్‌ చేసి సర్‌ప్రైజ్ చేసింది. సాధారణంగా హీరోయిన్స్ పొడవాటి జుట్టుతో మాత్రమే కనిపిస్తారు. కానీ శాంతి ప్రియ అనూహ్యంగా గుండుతో కనిపించడంతో అంతా షాక్‌ అవుతున్నారు. ఏం జరిగిందని చాలా మంది కామెంట్‌ చేశారు. ఈ ఫోటోలను షేర్ చేసిన శాంతి ప్రియ తాను కొత్త లుక్‌ కోసం ఇలా చేసినట్లు చెప్పుకొచ్చింది. ఇలా చేయడానికి ధైర్యం కావాలి. తనలోని కొత్త యాంగిల్‌ను చూపించడం కోసం ఇలాంటి పని చేయాల్సి వచ్చిందని, తనకు ఇది ఇబ్బందిగా అనిపించడం లేదని ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిందట.


జుట్టు లేకుండా కనిపించడం గురించి శాంతి ప్రియ మాట్లాడుతూ... ఈ అనుభవం విభిన్నంగా ఉంది. స్త్రీలు జీవితంలో పరిమితులు ఏర్పరుచుకుంటారు. నియమాల ప్రకారం వెళ్తూ ఉంటారు. ఆ పరిమితులు, నియమాలు స్త్రీలను బోనులో బంధించి ఉంచుతున్నాయి. అయితే వాటి నుంచి నేను స్వేచ్ఛగా ఉండాలని భావిస్తున్నాను. అందుకోసం ప్రతి సారి నేను వాటి నుంచి విముక్తి పొందేందుకు చూస్తూ ఉంటాను. నా దివంగత భర్త జ్ఞాపకాల్లో ఉన్న నేను ఆయన బ్లేజర్‌ను ధరించాను. దాంతో అతడి వెంట ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. అతడు ఎప్పుడూ నా వెంట ఉన్నాడనే ఫీలింగ్ ఉందని శాంతిప్రియ లవ్‌ ఈమోజీని షేర్‌ చేసింది.

ఏపీలోని రాజమండ్రి సమీపంలోని రంగంపేట గ్రామంలో పట్టాభిరామన్‌, ఎం లక్ష్మి దంపతులకు భానుప్రియ, శాంతిప్రియ జన్మించారు. వీరికి సోదరుడు గోపీకృష్ణ ఉన్నారు. అక్క భాను ప్రియ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకోవడంతో, ఆమె దారిలోనే శాంతిప్రియ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అయితే ఆమెకు ఆశించిన స్థాయిలో స్టార్‌డం దక్కలేదు. భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ అనే గుర్తింపు నుంచి సొంత గుర్తింపును దక్కించుకోలేక పోయింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో అయినా రాణించాలని ప్రయత్నాలు చేస్తుంది. తెలుగులో ఈమె మహర్షి, నాకు పెళ్ళాం కావాలి, సింహ స్వప్నం, అగ్ని, కలియుగ అభిమన్యుడు సినిమాల్లో నటించింది.