Begin typing your search above and press return to search.

షన్నూ కేసులో ట్విస్ట్.. డిప్రెషన్ వల్లే !

తక్కువ టైమ్ లోనే సెలబ్రిటీగా మారిపోయిన ఫేమస్ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్.. గంజాయి కేసులో ఇటీవల అరెస్ట్ అవ్వడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   25 Feb 2024 2:59 PM GMT
షన్నూ కేసులో ట్విస్ట్.. డిప్రెషన్ వల్లే !
X

తక్కువ టైమ్ లోనే సెలబ్రిటీగా మారిపోయిన ఫేమస్ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్.. గంజాయి కేసులో ఇటీవల అరెస్ట్ అవ్వడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తన సోదరుడు సంపత్ వినయ్ ఓ యువతిని మోసం చేసిన కేసులో షణ్ముఖ్ గంజాయితో పట్టుబడిన సంగతి తెలిసిందే. షణ్ముఖ్ ను అదుపులోకి తీసుకునే సమయంలోని పలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి

ఓ యువతి ఫిర్యాదు మేరకు సంపత్ ఫ్లాట్‌ కు వెళ్లిన హైదరాబాద్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో షణ్ముఖ్.. బాధితురాలితో మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో నేనే డిప్రెషన్‌ లో ఉన్నా.. సూసైడ్ చేసుకుందామనుకున్నా అని షణ్ముఖ్ చెబుతున్నాడు. తన పరిస్థితి బాలేదని చెబుతూ షణ్ముఖ్ ఏడుస్తున్నట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో అతడి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే డిప్రెషన్ లో ఉన్నందుకే.. షన్నూ గంజాయి తీసుకున్నాడేమో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గంజాయిని సీజ్ చేసిన పోలీసులు వినయ్, షణ్ముఖ్‌ ను అరెస్టు చేశారు. వేర్వేరు కేసులు నమోదు చేసి వినయ్‌ ను రిమాండ్‌ కు తరలించారు. షణ్ముఖ్‌ గంజాయి సేవించాడా లేదా అన్న విషయం నిర్ధరించేందుకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

వైవా యూట్యూబ్ షార్ట్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు షణ్ముఖ్ జస్వంత్. ఆ తర్వాత వరుస షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ తక్కువ టైంలోనే స్టార్ యూట్యూబర్ అయిపోయాడు. ఇక బిగ్ బాస్ ఛాన్స్ దక్కించుకుని హౌస్ లోకి వెళ్లాడు. అయితే అంతకుముందు నుంచే దీప్తి సునయనతో లవ్ లో ఉన్నాడు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక.. వీరిద్దరు బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు.

హౌస్ నుంచి బయటకు రాగానే పెళ్లి చేసుకుంటారనుకున్న ఈ జంట.. విడిపోయి షాక్ ఇచ్చారు. అయితే దీప్తి సునయన బ్రేకప్ చెప్పడానికి.. షన్నూ బిహేవియరే కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత షన్నూ.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డాడు. ఆ సమయంలో కూడా డ్రగ్స్ తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు గంజాయితో దొరికిపోయాడు. అసలు షన్నూకు ఏమైంది? ఎందుకిలా అనేది తెలియాల్సి ఉంది.