Begin typing your search above and press return to search.

స్టార్ హీరో టైమ్ బ్యాడ్.. ప‌దే ప‌దే చెయ్యిస్తున్న డైరెక్ట‌ర్

కార‌ణం ఏదైనా ర‌ణ్ వీర్ తో సినిమాని వెంట‌నే ప్రారంభించేందుకు శంక‌ర్ కి తీరిక చిక్క‌డం లేదు. క‌నీసం ఇప్పుడైనా ప్రారంభిస్తాడా?

By:  Tupaki Desk   |   16 July 2023 11:19 AM GMT
స్టార్ హీరో టైమ్ బ్యాడ్.. ప‌దే ప‌దే చెయ్యిస్తున్న డైరెక్ట‌ర్
X

ఏదైనా సినిమాని ప్ర‌క‌టించాక అంత‌కంత‌కు రిలీజ్ ఆల‌స్య‌మ‌వుతోంది అంటే దానిపై ప్ర‌జ‌ల్లో క్యూరియాసిటీ తగ్గిపోతుంది. నిజానికి శంక‌ర్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ ర‌ణ్ వీర్ లాంటి ఎన‌ర్జిటిక్ హీరోతో హిందీలో అప‌రిచితుడు (అన్నియ‌న్) ని రీమేక్ చేస్తున్నార‌ని తెలియ‌గానే ఒక‌టే ఉత్కంఠ ఏర్ప‌డింది. దీనిపై మీడియాలో ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.

ఓవైపు రామ్ చ‌ర‌ణ్ తో 'గేమ్ ఛేంజ‌ర్' కోసం ప‌ని చేస్తూనే ర‌ణ్ వీర్ తో సినిమా కోసం గ్రౌండ్ వ‌ర్క్ చేసారు శంక‌ర్. అప‌రిచితుడు హిందీ రీమేక్ ని అధికారికంగా కూడా ప్ర‌క‌టించేశారు. కానీ ఇంత‌లోనే ఊహించ‌ని ట్విస్ట్ శంక‌ర్ జీవితంలోకి ప్ర‌వేశించింది. అప్ప‌టికే కోర్టు గొడ‌వ‌ల్లో ఉన్న 'భార‌తీయుడు 2'ని పూర్తి చేసేందుకు నిర్మాత లైకా సుభాష్క‌ర‌ణ్ కు స‌హ‌క‌రించాల్సిందిగా కోర్టు తీర్పును వెలువ‌రించ‌డంతో ఇక చేసేది లేక శంక‌ర్ గేమ్ ఛేంజ‌ర్ తో పాటు క‌మ‌ల్ హాస‌న్ 'భార‌తీయుడు 2' చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేస్తున్నాడు.

కార‌ణం ఏదైనా ర‌ణ్ వీర్ తో సినిమాని వెంట‌నే ప్రారంభించేందుకు శంక‌ర్ కి తీరిక చిక్క‌డం లేదు. క‌నీసం ఇప్పుడైనా ప్రారంభిస్తాడా? అంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దానికి స‌మాధానం అత‌డి నుంచి రావ‌డం లేదు.

ఇంత‌లోనే మ‌రో ఊహించ‌ని ట్విస్టు. ఇప్పుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ లియోని పూర్తి చేసి.. శంక‌ర్ వినిపించిన స్క్రిప్టు విని ఓకే చెప్పార‌ట‌. అంటే గేమ్ ఛేంజ‌ర్ - భార‌తీయుడు 2 పూర్త‌య్యాక విజ‌య్ తో సినిమాని కూడా శంక‌ర్ ప్రారంభించేందుకు ఆస్కారం ఉంది.

దీన‌ర్థం ర‌ణ‌వీర్ తో అప‌రిచితుడు రీమేక్ మ‌రింత ఆల‌స్యం కావ‌డ‌మేన‌ని చాలా మంది ఊహిస్తున్నారు. అలా కాకుండా విజ‌య్ తో సినిమాని పూర్తి చేస్తూనే ర‌ణ‌వీర్ తోను శంక‌ర్ సెట్స్ పైకి వెళ‌తారా? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాలి. ద‌ళ‌ప‌తి విజ‌య్ ప్ర‌స్తుతం లోకేష్ క‌న‌గ‌రాజ్ తో లియో చిత్రీక‌ర‌ణ‌ను ముగించి వెంక‌ట్ ప్ర‌భుతో సినిమాపై దృష్టి సారించారు.