Begin typing your search above and press return to search.

అందరి వల్ల శంకర్‌ గేమ్ ప్లాన్‌ ఛేంజ్‌..!

అసలు విషయం ఏంటి అంటే గేమ్ ఛేంజర్‌ సినిమాలో భారీ స్టార్ కాస్టింగ్ ను దర్శకుడు శంకర్‌ తీసుకున్నాడు. ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారింది.

By:  Tupaki Desk   |   25 Sep 2023 5:55 AM GMT
అందరి వల్ల శంకర్‌ గేమ్ ప్లాన్‌ ఛేంజ్‌..!
X

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న గేమ్‌ ఛేంజర్ సినిమా షూటింగ్‌ అదుగో ఇదుగో అన్నట్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది చివరి వరకు గేమ్‌ ఛేంజర్‌ ని ముగించి వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాల్సి ఉంటుంది. ఇప్పుడు అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు అనే టాక్‌ వినిపిస్తుంది.

అసలు విషయం ఏంటి అంటే గేమ్ ఛేంజర్‌ సినిమాలో భారీ స్టార్ కాస్టింగ్ ను దర్శకుడు శంకర్‌ తీసుకున్నాడు. ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారింది. ఒకరు షూటింగ్ కి రెడీ అంటే మరొకరు డేట్లు ఇవ్వలేక పోతున్నారు. రామ్ చరణ్‌ ఇతర సినిమాలను మొదలు పెట్టలేదు కనుక శంకర్ ఎప్పుడు అడిగినా కూడా డేట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పవచ్చు కానీ కియారా అద్వానీ అలా కాదు.

ఆమె హిందీలో పలు సినిమాల్లో నటిస్తోంది. కనుక గేమ్‌ ఛేంజర్‌ మేకర్స్ అడిగిన వెంటనే డేట్లు ఇవ్వడం ఆమెకు దాదాపుగా అసాధ్యం. అందుకే గతంలో ఆమె వల్ల షూటింగ్ ఆలస్యం అయిన దాఖలాలు ఉన్నాయి. ఈ సెప్టెంబర్ షెడ్యూల్ మాత్రం తమిళ్‌ దర్శకుడు కమ్‌ నటుడు అయిన ఎస్ జే సూర్య వల్ల అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ముందుగా కమిట్ అయిన జిగర్తాండ సీక్వెల్ షూటింగ్ లో పాల్గొంటున్న కారణంగా గేమ్‌ ఛేంజర్‌ సినిమాలో నటించలేను అంటూ సూర్య చెప్పాడట. దాంతో వచ్చే నెలలో డేట్లు ఇస్తానని కూడా చెప్పాడట. మొత్తానికి ఎస్ జే సూర్య వల్ల ఈ సారి సినిమా షూటింగ్ వాయిదా పడింది.

సూర్య మాత్రమే కాకుండా సునీల్‌, శ్రీకాంత్, అంజలి వంటి బిజీ స్టార్స్ కూడా ఈ సినిమా లో నటిస్తున్నారు. వారి వల్ల కూడా ఏంతో కొంత ఆలస్యం అవతూనే ఉంది. ఇలా అందరి వల్ల కూడా గేమ్ ఛేంజర్‌ సినిమా గేమ్‌ ప్లానింగ్ ఎప్పటికప్పుడూ చేంజ్ అవుతూనే ఉందని యూనిట్‌ సభ్యులు గగ్గోలు పెడుతున్నారు.