Begin typing your search above and press return to search.

2026 లో స్టార్ డైరెక్ట‌ర్ కొత్త క‌థ‌తోనే!

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ లైనప్ ఇదేనా? 2026 వ‌ర‌కూ ఆయ‌న షెడ్యూల్ ఫిక్సైపోయిందా? అంటే అవున‌నే కోలీవుడ్ వ‌ర్గాలంటున్నాయి.

By:  Tupaki Desk   |   14 April 2024 11:30 PM GMT
2026 లో  స్టార్ డైరెక్ట‌ర్  కొత్త క‌థ‌తోనే!
X

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ లైనప్ ఇదేనా? 2026 వ‌ర‌కూ ఆయ‌న షెడ్యూల్ ఫిక్సైపోయిందా? అంటే అవున‌నే కోలీవుడ్ వ‌ర్గాలంటున్నాయి. ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రెండు సినిమాలు తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయ‌కుడిగా `ఇండియ‌న్ -2` షూటింగ్ పూర్తి ముగించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. ఓవైపు ఆ ప‌నులు చూసుకుంటూనే శంక‌ర్ `గేమ్ ఛేంజ‌ర్` షూట్ కి హాజ‌ర‌వుతున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ లేదా డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు. అయితే `గేమ్ ఛేంజ‌ర్` పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌పై రిలీజ్ అనేది ఆధార‌ప‌డి ఉంది.

ఎలా లేద‌న్నా `గేమ్ ఛేంజ‌ర్` ఈడాది రిలీజ్ అవుతుంది. దీంతో శంక‌ర్ ఆ సినిమా నుంచి డిసెంబ‌ర్ క‌ల్లా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాడు. అటుపై `ఇండియ‌న్ -3` షూట్ లో పాల్గొంటారు. ఆ సినిమాకి సంబంధించి కొంత భాగం షూటింగ్ జ‌రిగింది. అంత వ‌ర‌కూ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా జ‌రుగుతున్నాయి. అయితే పెండింగ్ ప‌నులు..పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ 2025 లో పూర్త‌వుతుంది. అదే ఏడాది ఆ చిత్రాన్ని రిలీజ్ చేసే అవ‌కాశం ఉంది. అనంత‌రం శంక‌ర్ బాలీవుడ్ కి వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ర‌ణ‌వీర్ సింగ్ తో `అప‌రిచితుడు` సీక్వెల్ చేయాల‌ని ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. కానీ మాతృక నిర్మాత‌తో వివాదం కార‌ణంగా ఇక ఈ ఆసీక్వెల్ లేన‌ట్లేన‌ని తాజాగా అందుతోన్న స‌మాచారం. ప్ర‌త్యామ్నాయంగా ర‌ణ‌వీర్ తో కొత్త క‌థ‌తోనే ముందుకెళ్లేలా స‌న్నాహాలు చేస్తున్నారుట‌. శంక‌ర్ రైటింగ్ టీమ్ ని ఇప్ప‌టికే ఆదేశించిన‌ట్లు స‌మాచారం. ఆ ప్రాజెక్ట్ విష‌యంలో అన్నీ అనుకున్న‌ట్లు గ‌నుక జ‌రిగితే 2026లో ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే త‌మిళ ద‌ర్శ‌కులంతా బాలీవుడ్ వైపు చూస్తోన్న త‌రుణ‌మిది.

ఇటీవ‌లే ముర‌గ‌దాస్ కూడా స‌ల్మాన్ తో సికంద‌ర్ ప్రాజెక్ట్ ప్ర‌క‌టించారు. అలాగే సుధ‌కొంగ‌ర కూడా హిందీలో ఓ సినిమా చేస్తున్నారు. అట్లీ సైతం 2025 లో హిందీలోనే మ‌రో సినిమా చేసే ఆలోచ‌న‌లో ఉన్నాడు. ఈనేప‌థ్యంలో శంక‌ర్ కూడా హిందీకి వెళ్లే అవ‌కాశాలు ఎక్కువ‌గానే క‌నిపిస్తున్నాయి.