Begin typing your search above and press return to search.

ఇండియన్ 2… శంకర్ సెంటిమెంట్ మారట్లే..

సౌత్ ఇండియాలో కమర్షియల్ డైరెక్టర్ గా టాప్ చైర్ లో ప్రస్తుతం రాజమౌళి పేరు గట్టిగా వినిపిస్తోంది

By:  Tupaki Desk   |   15 April 2024 5:30 AM GMT
ఇండియన్ 2… శంకర్ సెంటిమెంట్ మారట్లే..
X

సౌత్ ఇండియాలో కమర్షియల్ డైరెక్టర్ గా టాప్ చైర్ లో ప్రస్తుతం రాజమౌళి పేరు గట్టిగా వినిపిస్తోంది. కానీ ఒకప్పుడు శంకర్ పేరు చెప్పేవారు. సోషల్ ఎలిమెంట్ ని కమర్షియల్ అంశాలు జోడించి స్టార్ హీరోలతో సినిమాలు చేసి శంకర్ సక్సెస్ అయ్యారు. అతని ప్రతి సినిమా తమిళంతో పాటు ఇతర భాషలలో కూడా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యేవి.

ముఖ్యంగా శంకర్ సినిమాలు అన్ని తమిళ్, తెలుగు భాషలలో రిలీజ్ అయ్యేవి. తమిళం తరహాలోనే తెలుగులో కూడా శంకర్ సినిమాలకి విశేషమైన ఆదరణ లభించింది. ఆయన సినిమాలలో కమల్ హాసన్ తో 1996లో చేసిన ఇండియన్ మూవీ సెన్సేషనల్ హిట్ అయ్యింది. దానిని తెలుగులో భారతీయుడు టైటిల్ తో రిలీజ్ చేస్తే ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. హిందీలో హిందుస్తానీ అనే టైటిల్ తో రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్నారు. ఆ సినిమాతోనే డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు రేంజ్ పెరిగింది.

గతంలో ఇతర భాషలలో తెరకెక్కే సినిమాలు ఏవైనా డబ్బింగ్ చేసేటపుడు ఆయా భాషలకి తగ్గట్లు పేర్లు పెట్టేవారు. హిందీ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయ్యి హిట్ అందుకున్నవి ఉన్నాయి. వాటికి తెలుగు పేర్లే పెట్టారు. అలాగే తమిళ సినిమాలని తెలుగులో రీజనల్ టైటిల్స్ తోనే రిలీజ్ చేశారు. అయితే బాహుబలి తర్వాత ట్రెండ్ మారింది. పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అవుతోన్న అన్ని సినిమాలకి ఒకే టైటిల్ ని పెడుతున్నారు.

అన్ని భాషలకి కనెక్ట్ అయ్యే విధంగా కామన్ టైటిల్స్ ని ఎంచుకుంటున్నారు. కానీ డైరెక్టర్ శంకర్ మాత్రం ప్రస్తుతం కమల్ హాసన్ తో చేస్తోన్న ఇండియన్ మూవీ సీక్వెల్ విషయంలో తన పాత పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఈ సినిమాకి తమిళంలో ఇండియన్ 2, తెలుగులో భారతీయుడు 2, హిందీలో హిందుస్తానీ 2 అనే పేర్లు ఖరారు చేస్తూ తాజాగా పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ పద్దతిలోనే గతంలో ఇండియన్ మూవీ వచ్చి సక్సెస్ అయ్యింది.

ఈ కారణంగా ఆయా భాషల ఆడియన్స్ కి ఏ టైటిల్స్ అయితే రీచ్ అయ్యాయో అదే టైటిల్స్ సీక్వెల్స్ కి కూడా ఉంటే ఎక్కువ రీచ్ ఉంటుందని శంకర్ తన ఓల్డ్ ఫార్మాట్ ని ఫాలో అయ్యినట్లు తెలుస్తోంది. ఇండియన్ మూవీ సీక్వెల్ 28 ఏళ్ళ తర్వాత రాబోతోంది కాబట్టి పాత పద్దతిలోనే టైటిల్ ఉండటం బెటర్ అనే మాట కూడా వినిపిస్తోంది. మరి ఈ పద్దతిలో ఇండియన్ మూవీ సీక్వెల్ తో శంకర్ ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటాడు అనేది వేచి చూడాలి.