Begin typing your search above and press return to search.

ఇండియన్‌ 2 కి అదే స్పెషల్‌..!

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది

By:  Tupaki Desk   |   2 Jun 2024 9:39 AM GMT
ఇండియన్‌ 2 కి అదే స్పెషల్‌..!
X

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. జులై 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే.

విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో తాజాగా సినిమా యొక్క ఆడియో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొన్నటి వరకు ఇండియన్ 2 సినిమా యొక్క ఆడియో పై ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి అంచనాలు లేవు. కానీ తాజాగా విడుదల అయిన పాటలతో ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

అనిరుధ్‌ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ అన్నట్లుగా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమా కోసం అనిరుధ్‌ అందించబోతున్న బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది అనే నమ్మకంను చిత్ర యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

ఇండియన్ 2 సినిమా కి అనిరుధ్ అందించిన నేపథ్య సంగీతం చాలా స్పెషల్‌ గా ఉంటుంది అంటూ మేకర్స్ చాలా నమ్మకంగా చెబుతున్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉండటంతో పాటు ప్రతి ఒక్కరిని మెప్పించే విధంగా సంగీతం ఉంటుంది అనే టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్‌ హీరోయిన్ గా నటించగా కీలక పాత్రలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఎస్‌జే సూర్య, వివేక్‌, బాబీ సింహా, బ్రహ్మానందం లు కనిపించబోతున్నారు. ఈ సినిమా ను లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్‌ తో నిర్మించారు. ఈ సినిమా కోసం అయిదు ఆరు ఏళ్లుగా ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.