Begin typing your search above and press return to search.

ఇండియన్ 2 : ఇది కదా శంకర్‌ సర్‌ రేంజ్‌

ఒక వైపు రామ్‌ చరణ్ గేమ్‌ చేంజర్ సినిమా ను షూట్‌ చేస్తూనే మరో వైపు కమల్ హాసన్ యొక్క ఇండియన్‌ 2 సినిమా ప్రమోషన్ కార్యక్రమాల పర్యవేక్షణ చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   27 Feb 2024 7:06 AM GMT
ఇండియన్ 2 : ఇది కదా శంకర్‌ సర్‌ రేంజ్‌
X

ఇండియన్‌ జేమ్స్ కేమరూన్ గా పేరు దక్కించుకున్న దర్శకుడు శంకర్‌ ప్రస్తుతం ఇండియన్‌ 2 కి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పని లో ఉన్నాడు. ఒక వైపు రామ్‌ చరణ్ గేమ్‌ చేంజర్ సినిమా ను షూట్‌ చేస్తూనే మరో వైపు కమల్ హాసన్ యొక్క ఇండియన్‌ 2 సినిమా ప్రమోషన్ కార్యక్రమాల పర్యవేక్షణ చేస్తున్నాడు.

ఇండియన్ 2 సినిమా కోసం అపార్ట్‌మెంట్‌ సమూహం కు పెద్ద ఎత్తున కమల్‌ హాసన్ యొక్క హోర్డింగ్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఆ హోర్డింగ్స్ ను సినిమా షూటింగ్ కి ఉపయోగించడం తో పాటు ప్రమోషన్ కి కూడా ఉపయోగించబోతున్నారు.

సాధారణంగా సినిమా షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత ఇలాంటి హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తారు. కానీ సినిమాలో ఆ హోర్డింగ్స్ ను కథ లో భాగంగా చూపించాల్సి ఉంటుందట. అందుకే గ్రాఫిక్స్ తో మ్యానేజ్ చేయకుండానే భారీ ఎత్తున ఖర్చు చేసి మరీ ఏర్పాటు చేయించారని తెలుస్తోంది.

ఖర్చుకు వెనకాడకుండా శంకర్‌ చేసిన ఈ ప్లెక్సీల ఏర్పాటు కు అంతా కూడా అవాక్కవుతున్నారు. బాబోయ్ ఏంటి ఈ రచ్చ అన్నట్లుగా తమిళ తంబీ లు ఫిదా అవుతున్నారట. శంకర్‌ సర్ రేంజ్ అంటే ఇది కదా అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

భారీ తనంకు పెట్టింది పేరు అయిన శంకర్‌ ఇండియన్ 2 సినిమా పై చాలా శ్రద్ధ పెట్టి చేస్తున్నట్లు తెలుస్తోంది. కమల్‌ సినీ కెరీర్‌ లో అత్యంత ఖరీదైన సినిమాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని ఆయన సన్నిహితులు అంటున్నారు.