Begin typing your search above and press return to search.

ఎప్పుడో సెట్టవ్వాల్సిన కాంబో.. ఇప్పుడు తెరపైకి!

శంకర్ తన నెక్స్ట్ మూవీని ఒక బాలీవుడ్ స్టార్ హీరోతో చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది ఎవరో కాదు షారుక్ ఖాన్ తోనేని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   5 Feb 2024 12:30 AM GMT
ఎప్పుడో సెట్టవ్వాల్సిన కాంబో.. ఇప్పుడు తెరపైకి!
X

శంకర్.. 17 ఏళ్లు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి జెంటిల్ మ్యాన్ సినిమాతో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. ఆయన దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలిచాయి. నిజానికి శంకర్ తమిళ దర్శకుడే అయినా.. ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. తమిళ ప్రేక్షకులతో సమానంగా శంకర్ ను ఆదరిస్తారు టాలీవుడ్ సినీ ప్రియులు.

అయితే శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన రోబో మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి.. శంకర్ తో కలిసి పనిచేయడం తన డ్రీమ్ అని చెప్పగా.. అది ఇంత వరకు నెరవేరలేదు. చిరుకు కుదరకపోయినా.. రామ్ చరణ్ కు ఆ అవకాశం దక్కింది. ప్రస్తుతం శంకర్- చరణ్ కాంబోలో గేమ్ ఛేంజర్ తెరకెక్కుతోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా.. సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది.

ప్రస్తుతం ఈ సినిమాతో పాటు శంకర్.. భారతీయుడు 2 మూవీని కూడా చేస్తున్నారు. ఆ చిత్రం కూడా ఇదే ఏడాది రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్స్ తర్వాత శంకర్ చేయబోయే తదుపరి చిత్రం పైన అందరిలో మంచి ఆసక్తి నెలకొంది. శంకర్ తన నెక్స్ట్ మూవీని ఒక బాలీవుడ్ స్టార్ హీరోతో చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది ఎవరో కాదు షారుక్ ఖాన్ తోనేని తెలుస్తోంది.

అప్పట్లో షారుక్ ఖాన్, శంకర్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు. అయితే ఆ మూవీ ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. మళ్లీ అదే కాంబినేషన్ లో మూవీ తెరకెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. షారుక్ గతేడాది పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు. డంకీతో అలరించారు. త్వరలోనే ఆయన కేజీఎఫ్ ఫేమ్ యశ్ తో కలిసి ఓ సినిమా చేస్తారని ఇటీవలే టాక్ వినిపించింది.

ఏదేమైనా శంకర్ రెండు ప్రాజెక్టులు గేమ్ ఛేంజర్, భారతీయుడు-2 పై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చివరగా శంకర్ తెరకెక్కించిన రోబో-2 సినిమా.. రోబో స్థాయిలో ఆడలేదు. దీంతో శంకర్ గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు, షారుక్ తో ప్రాజెక్ట్ పై శంకర్ ఎప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారో చూడాలి.