ఈసారి నిర్మాత కూడా శంకరే అవుతాడా?
'రోబో' తర్వాత 'వేల్పారి'ని శంకర్ మరో డ్రీమ్ ప్రాజెక్ట్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదీ భారీతనంతో కూడిన చిత్రమే.
By: Tupaki Desk | 12 July 2025 8:00 PM IST'రోబో'తర్వాత 'వేల్పారి'ని శంకర్ మరో డ్రీమ్ ప్రాజెక్ట్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదీ భారీతనంతో కూడని చిత్రమే. అతిభారీ విజువల్ ఎఫెక్స్ట్ ఉంటాయని వందల కోట్ల వ్యయంతో ముడిపడిన ప్రాజెక్ట్ గా వెల్లడించారు. శంకర్ త్వరలో చేయబోయే చిత్రం కూడా ఇదే. అయితే ఈ సినిమాకు నిర్మాత ఎవరు? అన్నది మాత్రం శంకర్ ఇంత వరకూ ప్రకటించలేదు. మరి నిర్మాత విషయాన్ని శంకర్ ఎందుకు గోప్యంగా ఉంచినట్లు? అసలింతకీ ఈ సినిమాకు నిర్మాత సెట్ అయిన తర్వాత ప్రకటించారా? లేక బజ్ కోసం ప్రకటించారా? అన్న సందేహం రాకపోలేదు.
ఎందుకంటే శంకర్ తో సినిమా నిర్మించడానికి ఇప్పుడెవరు ముందుకు రావడం లేదు. వరుస పరాజయాలో శంకర్ తో సినిమాలు తీసిన వాళ్లంతా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. సొంత భాష నిర్మాతలు ముందుకు రాకపోవడంతో టాలీవుడ్ కి వచ్చి 'గేమ్ ఛేంజర్'తీసారు. ఆయనతో సినిమా తీస్తే ఎలా ఉంటుంది? అన్నది నిర్మాత దిల్ రాజు కూడా అర్దమైంది. ఆయన కూడా చెంపలేసుకుని తప్పంతా నాదే అన్నట్లు సైలెంట్ అయిపోయారు.
మరి ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ కోలీవుడ్ నుంచి ఏ నిర్మాతైనా ముందుకు వస్తాడా? టాలీవుడ్ నుంచి ఇంకేవైనా ఆసక్తిగా ఉన్నారా? అన్నది పక్కన బెడితే? ఈ సినిమా కోసం శంకర్ నిర్మాతగా మారితే బాగుంటుంది అన్న వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. శంకర్ కేవలం దర్శకుడు మాత్రమే కాదు. నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు నిర్మించారు. అయితే అవి లవ్ స్టోరీలు..కాన్సెప్ట్ బేస్ట్ చిత్రాలు మాత్రమే. భారీ ఖర్చుతో కూడిన ఏ సినిమాకు శంకర్ నిర్మాతగా ఎవరితోనూ భాగస్వామ్యం కాలేదు.
ఇతర నిర్మాణ సంస్థలు వందల కోట్లు పెట్టుబడి పెడితే డైరెక్టర్ గా పనిచేయడం తప్ప తన జేబు నుంచి మాత్రం రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయలేదు. శంకర్ తో సినిమా అంటే నిర్మాత గుల్ల అయిపోవడం అనే విమర్శ చాలా కాలంగా ఉంది. కాబట్లి ఇప్పుడా విమర్శను..తను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం వచ్చిన నేపథ్యంలో 'వేల్పారి' ప్రాజెక్ట్ ను శంకర్ స్వీయా దర్శకత్వంలో నిర్మిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తానే నిర్మించి భారీ లాభాలు చూపించగలిగితే శంకర్ పై ఉన్న విమర్శ కూడా తొలగిపోతుంది. వందల కోట్లు తను జేబు నుంచే తీస్తే మరింత బాధ్యతగానూ ప్రాజెక్ట్ ను పూర్తి చేసినట్లు ఉంటుంది. మరి శంకర్ జీ ఆ రకంగా ఆలోచిస్తారేమో చూడాలి.
