ఈసారి శంకర్ బాలీవుడ్ -చైనాలకి వెళ్తున్నాడా?
ఇటీవలే స్టార్ డైరెక్టర్ శంకర్ తన నుంచి వస్తోన్న మరో డ్రీమ్ ప్రాజెక్ట్ గా `వేల్పారి` ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 15 July 2025 3:00 AM ISTఇటీవలే స్టార్ డైరెక్టర్ శంకర్ తన నుంచి వస్తోన్న మరో డ్రీమ్ ప్రాజెక్ట్ గా `వేల్పారి` ని ప్రకటించిన సంగతి తెలిసిందే. `రోబో` తర్వాత శంకర్ భావించిన మరో డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. టెక్నికల్ గానే ఈ కథ కూడా హైలైట్ గా ఉంటుంది. అత్యాదునిక సాంకేతిక విలువలతో తీయాల్సిన చిత్రంగా అభివర్ణించారు. అయితే ఈ సినిమా నిర్మాత ఎవరు అవుతారు? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొన్న సంగతి తెలిసిందే. శంకర్ గురించి తెలిసిన వారెవ్వరు ఆయనతో సినిమా తీయడానికి ముందుకొచ్చే పరిస్థితి లేదు.
అటు కోలీవుడ్ లో గానీ..ఇటు టాలీవుడ్ లో గానీ ఏ నిర్మాత అంత సాహసం చేసే పరిస్థితి లేదు. ఈనేప త్యంలోనే శంకర్ తన సినిమాకు తానే నిర్మాతగా మారితే తప్ప వేల్పరి సాధ్యం కాదన్న కథనాలు మీడియా లో వైరల్ అయ్యాయి. తాజాగా నిర్మాణం విషయంలో శంకర్ కొత్త స్ట్రాటజీని అనుసరిస్తున్నట్లు కోలీవుడ్ లో ఓ వార్త వెలువడింది. ఈ చిత్రం నిర్మాణం కోసం బాలీవుడ్ వాళ్లతో చర్చలు జరుపు తున్నాడుట.
ఓ అగ్ర నిర్మాణ సంస్థతో శంకర్ ట్రావెల్ అవుతున్నట్లు సమాచారం. ఈ సంస్థ కూడా నేరుగా పెట్టుబడి పెట్టకుండా ఓ చైనా కంపెనీ భాగస్వామ్యంతో నిర్మించాలని భావిస్తోందిట. అంటే ఇంటర్నేషనల్ వైడ్ గా శంకర్ కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను ఇప్పుడు వాడుతున్నట్లు కనిపిస్తుంది. శంకర్ కి ఇంటర్ నేషనల్ గా మంచి పేరుంది. ఆయన సినిమాలు `రోబో`, `శివాజీ` లాంటి సినిమాలు విదేశాల్లో సత్తా చాటిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే బాలీవుడ్-చైనా నిర్మాణ సంస్థలను శంకర్ రంగంలోకి దించుగున్నట్లు తెలుస్తోంది. `రోబో` సినిమాతో చైనాలోనూ శంకర్ కి ఫాలోయింగ్ మొదలైంది. అతడి క్రియేటివిటీకి దాసోమైన వారెంతో మంది. ఇప్పుడా క్రేజ్ ని శంకర్ తెలివిగా వాడుకుంటున్నట్లు కనిపిస్తుంది. శంకర్ పై నమ్మకంతో సౌత్ వాళ్లు పెట్టుబడి పెట్టకపోయినా? బాలీవుడ్ సహా ఇతర దేశాలు కాన్పిడెంట్ గా ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
