శంకర్ రెండేళ్లు విరామం తీసుకుంటారా?
ఈ సినిమా హిట్ అయితే టాలీవుడ్ లో ఆయన రేంజ్ మరోలా ఉండేది. వెంటనే మరో స్టార్ తో సినిమా ప్రకటించే ఛాన్స్ ఉండేది. కానీ ఆ సన్నివేశం లేదు.
By: Tupaki Desk | 25 April 2025 8:30 PM`గేమ్ ఛేంజర్` ప్లాప్ తర్వాత శంకర్ ఒక్కసారిగా సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా ఊహించని ఫలితాన్ని సాధించడంతో? విస్తుపోవాల్సిన పరిస్థితి. తొలి తెలుగు సినిమా శంకర్ కి దారుణమైన పరాభవాన్ని అందించింది. ఈ సినిమా హిట్ అయితే టాలీవుడ్ లో ఆయన రేంజ్ మరోలా ఉండేది. వెంటనే మరో స్టార్ తో సినిమా ప్రకటించే ఛాన్స్ ఉండేది. కానీ ఆ సన్నివేశం లేదు.
ఇక చేతిలో ఉన్న ప్రాజెక్ట్ `భారతీయుడు 3` ఒక్కటే. ఈ సినిమాపైనే శంకర్ ఆశలన్నీ. అయితే ఈ సినిమా పై కూడా ఏమాత్రం బజ్ లేదు. `భారతీయుడు 2` దారుణమైన ఫలితాన్ని సాధించడంతో? ఆ ప్రభావం ఈ చిత్రం పై పడింది. ఎంతలా అంటే `భారతీయుడు 3` ఓటీటీలో రిలీజ్ అవుతుంది అనేంత వరకూ సన్నివేశం వచ్చింది. అటుపై మేకర్స్ ఓటీటీ కాదు నేరుగా థియేటర్లోనే రిలీజ్ చేస్తామని వివరణ ఇవ్వడంతో వాతావరణం కూల్ అయింది.
ఇప్పటికే ఈ చిత్రం రిలీజ్ అవ్వాలి. కానీ అనివార్య కారణాలతో డిలే అవుతుంది. కానీ ఈ ఏడాది మాత్రం రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమా రిలీజ్ అనంతరం శంకర్ ఏం చేస్తారు? అంటే రెండేళ్ల పాటు శంకర్ ఎలాంటి సినిమా డైరెక్ట్ చేయరని కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రెండేళ్లు ఆయన కేవలం విశ్రాంతిలోనే ఉంటారని... రెండేళ్ల తర్వాత కొత్త ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తారని నెట్టింట ప్రచారం జరుగుతోంది.
మరి ఇందులో నిజమెంతో తేలాలి. సాధారణంగా శంకర్ వెంట వెంటనే సినిమాలు చేయరు. ఒక సినిమా రిలీజ్ తర్వాత గ్యాప్ తీసుకుంటారు. కూల్ గా కులాసాగా పనిచేయడం ఆయనకు అలవాటు. అయితే ఈసారి ఆ గ్యాప్ మరింత ఎక్కువ ఉండే ఛాన్సు ఉంది. ప్లాప్ ల్లో ఉన్న శంకర్ బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే బలమైన స్క్రిప్ట్ తో రావాలి. అలా కావాలంటే శంకర్ కి సరైన రైటర్ కావాలి. మరి శంకర్ రెండేళ్లు గ్యాప్ తీసుకునేది రైటర్ కోసమా? అన్నది మరో సందేహం.