Begin typing your search above and press return to search.

సీనియర్ స్టార్ తో సంజ‌య్ క‌పూర్ కుమార్తె రొమాన్స్!

బాలీవుడ్ కి మ‌రో స్టార్ కిడ్ ఎంట్రీ ఇస్తోంది. సంజ‌య్ క‌పూర్ స్వీట్ డాట‌ర్ శాన‌య్య క‌పూర్ 'అంఖోన్ కి గుస్తా కియాన్' చిత్రంతో లాంచ్ అవుతుంది.

By:  Tupaki Desk   |   26 May 2025 12:52 PM IST
సీనియర్ స్టార్ తో సంజ‌య్ క‌పూర్ కుమార్తె రొమాన్స్!
X

బాలీవుడ్ కి మ‌రో స్టార్ కిడ్ ఎంట్రీ ఇస్తోంది. సంజ‌య్ క‌పూర్ స్వీట్ డాట‌ర్ శాన‌య్య క‌పూర్ 'అంఖోన్ కి గుస్తా కియాన్' చిత్రంతో లాంచ్ అవుతుంది. ఇందులో అమ్మ‌డు విక్రాంత్ మాస్సే కి జోడీగా న‌టిస్తుంది. స్టార్ కిడ్ పెర్పార్మెన్స్ ఎలా ఉంటుంది? అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. క‌పూర్ బ్య‌టీకి సోష‌ల్ మీడి యాలో మంచి ఫాలోయింగ్ ఉంది. మ్యాక‌ప్ వేసుకోవ‌డానికి ముందే నెట్టింట క్రేజీ బ్యూటీగా వైర‌ల్ అయింది.

మోడ్ర‌న్ దుస్తుల్లో అల‌రిస్తూ కుర్ర బ్యూటీ బాగానే పేంప‌ర్ చేసింది. కానీ ట్యాలెంట్ చూపించాల్సిన చోట చూపిస్తుందా? లేదా? అన్న టెన్ష‌న్ అభిమానుల్లో ఉంది. ఈ సినిమా ఇదే ఏడాది రిలీజ్ కానుంది. అయితే ఈ చిత్రం రిలీజ్ కుముందే అమ్మ‌డు సీనియ‌ర్ హీరోతో రొమాన్స్ కు రెడీ అవుతుంది. బాలీవుడ్ స్టార్ ర‌ణ‌వీర్ సింగ్ కి జోడీగా శాన‌య్య క‌పూర్ ని ఎంపిక చేసారుట. కానీ ఇద్ద‌రి మ‌ధ్య వ‌య‌సు వ్య‌త్యాసం 15 ఏళ్లు ఉంది. శాన‌య్య క‌పూర్ వ‌య‌సు 25 ఏళ్లు. ర‌ణ‌వీర్ సింగ్ వ‌య‌సు 40.

హీరో-హీరోయిన్ల మ‌ధ్య ఇదేమి పెద్ద వ్య‌త్యాసం కాదు. 60-70 ఏళ్ల వ‌య‌సున్న హీరోలే 30 ఏళ్ల వ్య‌త్యాసం ఉన్న భామ‌ల‌తో న‌టిస్తున్నారు. ర‌జ‌నీకాంత్, చిరంజీవి, వెంక‌టేష్‌, నాగార్జున‌ల వ‌యసులు ఇప్ప‌టికే 60 దాటాయి. కానీ వాళ్లు న‌టిస్తున్న హీరోయిన్ల వ‌య‌సు మాత్రం 35 దాటి ఉండేలా చూసుకుంటున్నారు. మాస్ రాజా ర‌వితేజ మాత్రం ష‌ష్టిపూర్తికి ద‌గ్గ‌ర్లో ఉన్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న 57 ఏళ్లు.

కానీ ఆయ‌న‌కు హీరోయిన్ల వ‌య‌సుతో సంబంధం లేదు. ద‌ర్శ‌కుడు రాసుకున్న పాత్ర‌కు మ్యాచ్ అవు తుందంటే? త‌న‌కేం అభ్యంత‌రం లేదంటాడు రాజా. వీళ్లంద‌రితో ర‌ణ‌వీర్ సింగ్ ని పోల్చితే అత‌డు చాలా విష‌యాలు ప‌రిగ‌ణ‌లోకి తీసుకునే శాన‌య్య క‌పూర్ కి ఎస్ చెప్పిన‌ట్లు తెలుస్తోంది.