Begin typing your search above and press return to search.

స‌మంత‌కు మ‌యోసైటిస్.. ష‌మిత‌కు ఎండోమెట్రియోసిస్!

గ‌త కొంత‌కాలంగా సౌతిండియా సూప‌ర్ స్టార్ స‌మంత మ‌యోసైటిస్‌తో పోరాటం, చికిత్స గురించి త‌న అనుభ‌వాల‌ను వ‌ర్ణించిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   14 May 2024 1:11 PM GMT
స‌మంత‌కు మ‌యోసైటిస్.. ష‌మిత‌కు ఎండోమెట్రియోసిస్!
X

గ‌త కొంత‌కాలంగా సౌతిండియా సూప‌ర్ స్టార్ స‌మంత మ‌యోసైటిస్‌తో పోరాటం, చికిత్స గురించి త‌న అనుభ‌వాల‌ను వ‌ర్ణించిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్యాధితో స‌మంత పెయిన్ ఫుల్ ప్ర‌యాణం గురించి తెలుసుకుని అభిమానులు క‌ల‌త చెందారు. ఇప్పుడు శిల్పాశెట్టి సోద‌రి ష‌మితా శెట్టి అలాంటి మ‌రో విభిన్న‌మైన స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. ష‌మిత‌ ప‌లు హిందీ చిత్రాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. బిగ్ బాస్ 15లోను ఈ భామ సంద‌డి చేసింది. ప‌లు తెలుగు చిత్రాల్లోను క‌నిపించింది. ష‌మితా శెట్టి ఇటీవలే ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధికి శస్త్రచికిత్స చేయించుకుంది. ఇది కటి ప్రాంతంలో విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది. తన సోదరి శిల్పాశెట్టి రికార్డ్ చేసిన వీడియోను ష‌మిత తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసారు. ఈ వీడియో ద్వారా ఈ వ్యాధి ఏమిటో ప్రతి మహిళ తెలుసుకోవాలని షమిత కోరుతోంది.

ష‌మిత షేర్ చేసిన‌ వీడియోలో శస్త్రచికిత్స తర్వాత ఆసుపత్రి బెడ్‌పై క‌నిపించింది. శిల్పా త‌న సోద‌రిని సరిగ్గా ఏమి జరిగిందె చెప్పాల‌ని అడిగారు. దానికి షమిత `ఎండోమెట్రియోసిస్` అని సమాధానం ఇచ్చింది. ఇంకా ష‌మిత‌ తనకు ఆ వ్యాధి ఏమిటో కూడా తెలియదని.. అదే కారణంగా తాను భరించలేని నొప్పితో ఉన్నానని పేర్కొంది. ష‌మిత‌ ప్రతి స్త్రీని వ్యాధి గురించి గూగుల్ చేయమని కోరింది. చివరికి మీ శరీరంలో నొప్పికి ఒక కారణం ఉందని, మీరు బలంగా ఉండాలని పేర్కొంది.

ఈ వీడియోను షేర్ చేస్తూ.. షమిత 40 శాతం మంది మహిళలు ఈ వ్యాధితో బాధపడుతున్నారని, అయితే చాలామందికి అది తెలియదని రాశారు. ఇప్పుడు శస్త్రచికిత్స పూర్తయినందున, శారీరకంగా నొప్పి లేని, ఆరోగ్యకరమైన రోజుల కోసం తాను ఎదురు చూస్తున్నానని పేర్కొంది. నా నొప్పికి మూలకారణాన్ని కనుగొనేంత వరకు ఆగని నా డాక్టర్లు, నా గైనక్ డాక్టర్ నీతా వార్టీ .. నా జీపీ డాక్టర్ సునీతా బెనర్జీ ఇద్దరికీ నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను! ఇప్పుడు నేను ఈ వ్యాధిని శస్త్రచికిత్స ద్వారా తొలగించాను. నేను మంచి ఆరోగ్యం కోసం ఎదురు చూస్తున్నాను..అని ష‌మిత వ్యాఖ్యానించారు.

మొహబ్బతేన్ -జెహర్ వంటి హిట్ చిత్రాల్లో న‌టించిన షమితా శెట్టి, బిగ్ బాస్ OTT - బిగ్ బాస్ 15లో తన పాత్రకు విస్తృతమైన ప్రేమను అందుకుంది. తోటి కంటెస్టెంట్ తేజస్వి ప్రకాష్‌తో ష‌మితా పోటీప‌డింది. ఈ ఇద్ద‌రి షో వీక్షకుల్లో హాట్ టాపిక్ గా మారింది.