Begin typing your search above and press return to search.

స్టార్‌ క్రికెటర్‌ నోట ఎన్టీఆర్‌, ప్రభాస్ మాట..!

ఇండియాలో సినిమా స్టార్స్ తో సమానంగా క్రికెటర్స్ కి అభిమానులు ఉంటారు. సినిమా స్టార్స్ కి ఆయా భాషల ప్రేక్షకులు మాత్రమే అభిమానులు ఉంటారు.

By:  Tupaki Desk   |   20 Feb 2024 5:19 AM GMT
స్టార్‌ క్రికెటర్‌ నోట ఎన్టీఆర్‌, ప్రభాస్ మాట..!
X

ఇండియాలో సినిమా స్టార్స్ తో సమానంగా క్రికెటర్స్ కి అభిమానులు ఉంటారు. సినిమా స్టార్స్ కి ఆయా భాషల ప్రేక్షకులు మాత్రమే అభిమానులు ఉంటారు. కానీ క్రికెటర్స్ కి దేశ వ్యాప్తంగా భాష తో సంబంధం లేకుండా అభిమానులు ఉంటారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

టీం ఇండియా క్రికెటర్స్ కి కోట్లల్లో అభిమానులు ఉంటారు. అలాంటి క్రికెటర్స్‌ లో కొంత మంది బాలీవుడ్ మరియు సౌత్‌ సినీ స్టార్స్ ను ఫాలో అవ్వడం అభిమానించడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా టీం ఇండియా స్టార్‌ ఆటగాడు మహ్మద్ షమీ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

జాతీయ మీడియా సంస్థ తో మాట్లాడుతూ తనకు దక్షిణాది స్టార్‌ హీరోలు అయిన ప్రభాస్ మరియు ఎన్టీఆర్‌ లు అంటే చాలా ఇష్టం అన్నాడు. వారి నటనను నేను ఎంజాయ్‌ చేస్తాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. మహ్మద్‌ షమీ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ప్రభాస్ నటించిన బాహుబలి మరియు ఎన్టీఆర్‌ నటించిన ఆర్‌ఆర్ఆర్ సినిమాలు చూడటం తనకు చాలా ఇష్టం అని, వాటిని పలు సార్లు చూసినట్లుగా కూడా షమీ చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో షమీ యొక్క వ్యాఖ్యలను ప్రభాస్ మరియు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ షేర్‌ చేస్తూ సందడి చేస్తున్నారు.