Begin typing your search above and press return to search.

అమెరికాలో కూడా 'శంభాల' హవా.. టీజర్ తోనే స్ట్రాంగ్ బజ్!

ఇప్పుడు నటిస్తున్న శంభాల: ఎ మిస్టికల్ వరల్డ్ సినిమా టీజర్‌కు విదేశీ తెలుగు సభలో అద్భుత స్పందన లభించింది. ఈ సినిమాకు సంబంధించి పోస్టర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి వైరల్‌ ట్రాక్‌ రికార్డు అందుకున్నాయి.

By:  Tupaki Desk   |   17 July 2025 2:51 PM IST
అమెరికాలో కూడా శంభాల హవా.. టీజర్ తోనే స్ట్రాంగ్ బజ్!
X

యంగ్ హీరో ఆది సాయికుమార్ తనదైన నటనతో వేరియేషన్ పాత్రల్లో కనిపిస్తూ అభిమానులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల అతను ఎంచుకుంటున్న కథలు, కథానాయికలు కొత్తగా ఉండడమే కాకుండా, మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు నటిస్తున్న శంభాల: ఎ మిస్టికల్ వరల్డ్ సినిమా టీజర్‌కు విదేశీ తెలుగు సభలో అద్భుత స్పందన లభించింది. ఈ సినిమాకు సంబంధించి పోస్టర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి వైరల్‌ ట్రాక్‌ రికార్డు అందుకున్నాయి.


ఈ చిత్రాన్ని యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్నారు. సినిమా పక్కా సూపర్ నేచురల్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగనుందని టీజర్ ద్వారా ఒక క్లారిటి అయితే ఇచ్చేశారు. ఆది పాత్రలో అంతరంగిక పోరాటం, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ ప్రేక్షకుల మనసును ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన మేకింగ్ వీడియో కూడా సినిమాపై అంచనాలను పెంచింది.

తాజాగా అమెరికాలో జరిగిన ప్రముఖ తెలుగు సంఘం నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) 2025 ఈవెంట్‌లో ‘శంభాల’ టీజర్‌ను ప్రదర్శించడం హైలైట్‌గా మారింది. టాలీవుడ్ ప్రముఖులు అల్లు అర్జున్, సమంత, శ్రీలీల, సుకుమార్ ఈ వేడుకలో పాల్గొనగా, సంగీత దర్శకుడు ఎస్ థమన్ లైవ్ స్టేజ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. అదే సమయంలో థమన్ తాను ఆలపించిన నేపథ్య సంగీతంతో ‘శంభాల’ టీజర్‌ను ప్రదర్శించడం ప్రేక్షకులను ఆహ్లాదానికి గురిచేసింది. ఆదిని చూసి అందరూ చప్పట్లతో వ్ మద్దతు ఇచ్చారు.

ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీని ప్రవీణ్ కె. బంగారి అద్భుతంగా హ్యాండిల్ చేశారు. ఈ సినిమాలో అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజువల్స్ అలాగే కథనం పరంగా ‘శంభాల’ సినిమా ఒక మిస్టికల్ ఎక్స్‌పీరియెన్స్‌గా ఉండబోతుందని యూనిట్ చెబుతోంది. హిందూ పురాణాల నుంచి తీసుకున్న కొన్ని అంశాలను ఆధునిక థ్రిల్లర్ రూపంలో చూపించబోతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమాను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. ఓవర్‌సీస్ మార్కెట్‌లో ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ ఉండటంతో థియేట్రికల్, ఓటీటీ రైట్స్ విషయంలో పోటీ నెలకొంది. ఇప్పటికే టీజర్‌కు వచ్చిన స్పందనను బట్టి చూస్తే, విడుదల తర్వాత సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం. ఒకసారి విడుదల తేదీ అధికారికంగా వచ్చాక, ప్రమోషన్స్ మరింత బలంగా జరగనున్నట్లు మేకర్స్ చెబుతున్నారు.