మధునందన్ మనసులు గెలిచేశాడోచ్..
ఆది సాయికుమార్ హీరోగా యుగంధర్ ముని డైరెక్షన్ లో వచ్చిన సినిమా శంబాల. క్రిస్మస్ కానుకగా నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
By: Tupaki Desk | 25 Dec 2025 12:45 PM ISTఆది సాయికుమార్ హీరోగా యుగంధర్ ముని డైరెక్షన్ లో వచ్చిన సినిమా శంబాల. క్రిస్మస్ కానుకగా నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ముందు నుంచి ఆడియన్స్ లో ఒక మంచి బజ్ ఏర్పడింది. అందుకు తగినట్టుగానే ప్రమోషనల్ కంటెంట్ ఉండటంతో ఆది సాయికుమార్ సినిమాలకు ఈమధ్య కాలంలో ఏ సినిమాకు లేని వైబ్ ఈ శంబాల తెచ్చుకుంది. ఫైనల్ గా ఆడియన్స్ నుంచి కూడా శంబాల సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఆదికి ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడనే అంటున్నారు.
హనుమంతు రోల్ లో మధునందన్..
శంబాల సినిమాలో ప్రతి యాక్టర్ తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమాలో అన్ని రోల్స్ అదిరిపోయాయి. ఐతే హనుమంతు రోల్ లో మధునందన్ అదరగొట్టాడు. సినిమా చూసిన ఆడియన్స్ అతన్ని ప్రశంసిస్తున్నారు. మధునందన్ ఒక మంచి నటుడు. ఇప్పటికే అతను చాలా సినిమాలు చేశాడు. ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే మధునందన్ ఆకట్టుకుంటాడన్న నమ్మకం ఉంది. ఐతే శంబాలలో హనుమంతు పాత్రలో కానిస్టేబుల్ రోల్ లో మరింత ఇంప్రెస్ చేశాడు మధునందన్.
ముఖ్యంగా సినిమాలో ఎమోషనల్ సీన్ లో అతని యాక్టింగ్ ఆడియన్స్ ని టచ్ చేసింది. ఒక మంచి నటుడికి సరైన పాత్ర పడితే ఎలా ఉంటుందో శంబాలలో మధునందన్ అభినయం చూస్తే తెలుస్తుంది. ఈమధ్య వరుస సినిమాలైతే చేస్తున్నా ఆడియన్స్ లో రిజిస్టర్ అయ్యే రోల్ పడలేదు. ఐతే శంబాలాలో తనకు వచ్చిన ఈ అవకాశాన్ని పర్ఫెక్ట్ గా వాడుకున్నాడు మధునందన్.
నువ్వు నేను తో తెరంగేట్రం..
2001లో నువ్వు నేను సినిమాలో ఫ్రెండ్ రోల్ తో తెరంగేట్రం చేసిన మధునందన్ తెలుగు పరిశ్రమలో పాతికేళ్లు పూర్తి చేసుకున్నాడు. అతని కెరీర్ లో కొన్ని మంచి రోల్స్ పడ్డాయి. కమెడియన్ గా మధునందన్ చేసిన సినిమాలు ఆకట్టుకున్నాయి. కేవలం కమెడియన్ గానే కాదు కొన్ని డిఫరెంట్ రోల్స్ తో కూడా ఇంప్రెస్ చేశాడు. ఫైనల్ గా శంబాలలో హనుమంతు రోల్ తో అదరగొట్టాడు.
మధునందన్ లాంటి వాళ్లు ఎలాంటి పాత్ర ఇచ్చినా ప్రాణం పెట్టేస్తారు అన్న దానికి అతను శంబాల సినిమాలో చేసిన రోల్ చూస్తే తెలుస్తుంది. ఆఫ్టర్ గ్యాప్ మధు మళ్లీ తిరిగి ఫాంలోకి వచ్చేలా శంబాల సినిమాలో అతని పాత్ర ఉంది. మధునందన్ ఫ్యూచర్ లో కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రోల్స్ చేస్తే చూడాలని ఆడియన్స్ కోరుతున్నారు.
ఆది సాయి కుమార్ సినిమాకు ఈమధ్య కాలంలో ఇలాంటి పాజిటివ్ టాక్ ఏ సినిమాకు రాలేదు. శంబాల మాత్రం పాజిటివ్ మౌత్ టాక్ తెచ్చుకుంది.
