Begin typing your search above and press return to search.

వీడియో : పూలతో అందం దాచి కవ్విస్తోంది

ఆ ఫోటో షూట్‌ ఏమో కానీ, వీడియో మాత్రం చూపు తిప్పుకోనివ్వడం లేదు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 Feb 2024 5:42 AM GMT
వీడియో : పూలతో అందం దాచి కవ్విస్తోంది
X

బాలీవుడ్ బ్యూటీ షామా సికిందర్ నాలుగు పదుల వయసు దాటిన తర్వాత కూడా అందాల ఆరబోత విషయంలో యంగ్ హీరోయిన్స్ కి పోటీని ఇస్తోంది. 1999 లో మాన్ సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అమ్మడు యే మేరీ లైఫ్ హై అనే సీరియల్‌ ద్వారా మంచి పాపులారిటీని దక్కించుకుని, హీరోయిన్ రేంజ్ లో బుల్లి తెరపై వెలుగు వెలిగింది.

బుల్లి తెరపై కనిపిస్తూనే మరోవైపు వెండి తెరపై సినిమాల్లో నటించే ఆఫర్లు దక్కించుకుంటూ వచ్చింది. ఈ అమ్మడు అందాల ఆరబోత చేస్తూ సోషల్‌ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ఫాలోయింగ్ దక్కించుకుంది. మూడు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ను కలిగి ఉన్న షామా సికిందర్ ఈసారి వీడియోను షేర్‌ చేసి కవ్విస్తోంది.

విభిన్నమైన ఔట్ ఫిట్ లో ఫోటో షూట్‌ కి షామా సికిందర్ రెడీ అయ్యింది. ఆ ఫోటో షూట్‌ కోసం తన ఎద భాగం కు అడ్డుగా అందమైన తెల్లటి గులాబీలను అడ్డుగా పెట్టుకుంది. ఆ ఫోటో షూట్‌ ఏమో కానీ, వీడియో మాత్రం చూపు తిప్పుకోనివ్వడం లేదు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంతటి అందం కు నాలుగు పదుల వయసు దాటింది అంటే నమ్మలేకుండా ఉన్నాను అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తున్న ఈ అమ్మడు ముందు ముందు సౌత్‌ సినిమా ఇండస్ట్రీలో కూడా నటిగా, ఐటెం సాంగ్స్ తో అలరిస్తుందో చూడాలి.