Begin typing your search above and press return to search.

తెల్ల స్విమ్‌సూట్‌లో అరేబియ‌న్ గుర్రంలా!

షామా సికందర్ సెక్సీ వైట్ స్విమ్‌సూట్ ధ‌రించి కాశ్మీర్ మంచులో ఫోటోషూట్ లో పాల్గొన్న ఫోటోలు ఇప్పుడు వెబ్ ని సునామీలా చుట్టేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   26 Oct 2023 4:38 PM GMT
తెల్ల స్విమ్‌సూట్‌లో అరేబియ‌న్ గుర్రంలా!
X

స్విమ్ సూట్ లు, బికినీలు బాలీవుడ్ న‌టి కం మోడ‌ల్ షామా శికంద‌ర్ కు కొత్తేమీ కాదు. గ‌డిచిన రెండేళ్లుగా షామా విదేశీ ప్రియుడితో షికార్ల‌లో ఇలాంటి కంటెంట్ ని ఇన్ స్టాలో షేర్ చేసింది కానీ, ఈసారి రొటీన్ కి భిన్న‌మైన స్విమ్ సూట్ తో మ‌తులు చెడ‌గొడుతోంది. షామా సికందర్ సెక్సీ వైట్ స్విమ్‌సూట్ ధ‌రించి కాశ్మీర్ మంచులో ఫోటోషూట్ లో పాల్గొన్న ఫోటోలు ఇప్పుడు వెబ్ ని సునామీలా చుట్టేస్తున్నాయి. సోషల్ మీడియాల్లో అభిమానులకు ఇది ఒక స్పెష‌ల్ ట్రీట్ గా మారింది.


బుధవారం ఉదయం షామా హాట్ మోనోక్రోమ్ లుక్ లో వేడి పెంచింది. అందమైన తెల్లటి స్విమ్‌సూట్ కి త‌గ్గ‌ట్టుగానే త‌న డిజైన‌ర్ లుక్ తో అగ్గి రాజేసింది. ఈ ఫోటోకు క్యాప్షన్ ఇస్తూ ఇలా రాసింది. ''నా చిరునవ్వు ఈ ఫోటోకి రంగునిస్తుందని ఆశిస్తున్నాను. మీరంతా ఈ రూపాన్ని ఊహించగలరా? ఫోటోను చూసి చెప్పండి'' అని వ్యాఖ్య‌ను జోడించింది. ఈ ఫోటోని చూడ‌గానే ఆ స్థలం బహుశా కాశ్మీర్ అని ఊహిస్తూ చాలా మంది నెటిజ‌నులు కామెంట్లు చేసారు. సౌకర్యం ఆడంబరం నిజమైన స్వరూపం.. కాశ్మీర్ అని భావిస్తున్నాను అని ఒక నెటిజ‌న్ వ్యాఖ్యానించారు. ''మీరు చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు'' అని ఒక‌రు, 'కశ్మీర్ కీ కాళీ' అని మ‌రొక‌రు కామెంట్ చేసారు. తెల్ల స్విమ్‌సూట్‌లో అరేబియ‌న్ గుర్రంలా ఉంది ఎవ‌రీ సొగ‌స‌రి? అంటూ ఒక అభిమాని వ్యాఖ్యానించారు.

అందాల న‌టి షామా టెలివిజ‌న్ షోల‌తో పాపుల‌ర్. బాల్ వీర్, యే మేరీ లైఫ్ హై, మాయా: స్లేవ్ ఆఫ్ హర్ డిజైర్స్ వంటి అనేక షోల‌తో అల‌రించారు. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో షామా వెబ్-సిరీస్ లతో పాటు సినిమాల్లోను న‌టించాల‌నుకుంటున్నాన‌ని తెలిపింది. టెలివిజన్‌కు తిరిగి రావాలని కోరుకోవడం లేదని కూడా అభిప్రాయం వ్య‌క్తం చేసింది. ''నేను వెబ్ సిరీస్‌లు ఫీచర్ సినిమాలు మాత్రమే చేస్తాను. విభిన్నమైన సినిమాలు, ముఖ్యమైన కథలు నా వ‌ద్ద‌కు వ‌స్తే చేయాలని భావిస్తున్నాను.

ప్రజల జీవితాలకు తోడ్పడే పాత్రలను తెరపై చేయాలనుకుంటున్నాను. కంటెంట్ కి త‌గ్గ‌ కళ.. కీర్తి అవ‌స‌రం. ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోసం గొప్ప ప్రయోజనం కోసం క‌ళ‌ను ఉప‌యోగించాల‌ని భావిస్తున్నాను. కాబట్టి నేను ఒక పెర్‌ఫార్మర్‌ని గా ఉత్తమమైన పాత్రలకు అర్హురాలిగా శక్తివంతమైన ప్రదర్శనలు చేయాలనుకుంటున్నాను'' అని త‌న మ‌న‌సులో మాట‌ను చెప్పింది.