ఇదే కదా జీవితం అంటే! సూసైడ్ యత్నించిన నటి ఇప్పుడిలా!!
నేను చాలా నిరాశకు గురయ్యాను.. నాకు పరిశ్రమ నచ్చలేదు. ఇక్కడి ప్రజలు నాకు నచ్చలేదు. అందరూ చాలా స్వార్థపరులుగా ఉండటం నచ్చలేదు.
By: Tupaki Desk | 29 Jun 2025 8:45 AM ISTటీవీ మూవీ నటి షామా శికందర్ పరిచయం అవసరం లేదు. ఇటీవల డెబినా బోనర్జీ పాడ్‌కాస్ట్‌లో తన జీవితంలోని ఒక భయానకమైన బాధాకరమైన అధ్యాయం గురించి మాట్లాడారు. తాను బైపోలార్ డిజార్డర్, డిప్రెషన్‌తో పోరాడానని తెలిపారు. చాలా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించిన తర్వాత ఆసుపత్రిలో చేరిన క్షణాలు తనను పూర్తిగా మార్చేసాయని చెప్పారు.
అయితే పరిశ్రమపై కోపాన్ని అణచుకోవడం వల్లనే షామా నిరాశకు గురైంది. తన అణచివేతకు కారకులైన వారిపై పగ తీర్చుకోవాలనుకున్నా అది సాధ్యపడలేదు. అందుకే తీవ్ర నిరాశతో డిప్రెషన్ కు లోనైంది. ఆ తర్వాత తనను బైపోలార్ డిజార్డర్ వెంటాడింది. చివరికి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేస్తే తనను తన కుటుంబీకులు కాపాడారు. అపస్మారక స్థితిలో ఉన్న తనను ఆస్పత్రిలో చేర్చగా కడుపు లోనికి వెళ్లిన విషాన్ని వైద్యులు కక్కించారు. బయటకు తీసారు. దాంతో తాను బతికి బయటపడిపోయానని తెలిపింది.
నేను చాలా నిరాశకు గురయ్యాను.. నాకు పరిశ్రమ నచ్చలేదు. ఇక్కడి ప్రజలు నాకు నచ్చలేదు. అందరూ చాలా స్వార్థపరులుగా ఉండటం నచ్చలేదు. మొదట నేను బాధను అనుభవించాను. ఆ చీకటి సమయంలో అధిక మోతాదులో నిద్ర మాత్రలు తీసుకున్నాను. ఆత్మహత్య చేసుకుని చనిపోవడానికి ప్రయత్నించాను.. కానీ నేను తిరిగి వచ్చాను. నన్ను ఆసుపత్రికి తరలించారు. నా చేతులు కట్టివేసారు. నేను చూసినప్పుడు, ఇది స్వర్గం కాదని నేను అనుకున్నాను... అని షామా నాటి సంగతుల్ని గుర్తు చేసుకుంది. కొన్నేళ్లుగా తనకు మానసిక వైద్యులు చికిత్స చేస్తున్న విషయం కూడా తనకు తెలియదని షామా తెలిపింది.
కానీ ఈరోజు ఉన్న జీవితం రేపు ఉండదు. రేపు ఉన్నది ఎల్లుండు ఉండదు. అది ఎప్పుడూ దశల వారీగా మారుతుంది. ఈ విషయాన్ని గ్రహించలేకే చాలా మంది ఆత్మహత్యకు పాల్పడతారు. అందులో షామా కూడా ఉంది. కానీ అంతా మారిపోయింది.. కాలంతో పాటే!
షామా ఇప్పుడు తన ప్రేమికుడైన భర్తతో అందమైన జీవితాన్ని గడుపుతోంది. అదే సమయంలో దేశ విదేశాల్లో సంచరిస్తూ తన ఆనందమయ జీవితాన్ని ప్రపంచానికి తెలియజేస్తోంది. ప్రస్తుతం విదేశీ బీచ్ లలో ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫోటోలను షామా షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. షామా అందాలను తడిపి ముద్ద చేసేందుకు టైడ్స్ ఎలా పోటీపడుతున్నాయో చూస్తున్నారు కదా?
