పెద్ది యాక్షన్ సీన్స్.. ఫ్యూజులు ఔటయ్యే అప్డేట్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బుచ్చి బాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ కలిసి నిర్మిస్తున్నారు.
By: Tupaki Desk | 29 Nov 2025 1:09 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బుచ్చి బాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ కలిసి నిర్మిస్తున్నారు. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. ఇప్పటికే పెద్ది నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ చికిరి చార్ట్ బస్టర్ గా నిలిచింది. పెద్ది రిలీజ్ కి ముందే చికిరి సాంగ్ 110 మిలియన్ వ్యూస్ తో సెన్సేషనల్ అనిపించుకుంది. పెద్ది సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ స్టంట్ మాస్టర్..
శివ రాజ్ కుమార్, చరణ్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమా యాక్షన్ కొరియోగ్రఫీ కోసం బాలీవుడ్ స్టార్ స్టంట్ మాస్టర్ శ్యామ్ కౌశల్ ని తీసుకొస్తున్నారట. దంగల్ నుంచి మొన్న రిలీజైన తేరే ఇష్క్ మైన్ సినిమా వరకు శ్యాం కౌశల్ తన యాక్షన్ కొరియోగ్రఫీతో యాక్షన్ ప్రియులను అలరిస్తూ వచ్చారు. పెద్ది సినిమా కోసం శ్యామ్ కౌశల్ ఆధ్వర్యంలో నవకాంత్ యాక్షన్ సీన్స్ కంపోజ్ చేస్తున్నారట. సినిమాలో ఈ యాక్షన్ సీన్స్ మూవీకే హైలెట్ అనిపించేలా ఉంటాయని టాక్.
బాలీవుడ్ లో సీనియర్ యాక్షన్ కొరియోగ్రాఫర్ అయిన శ్యామ్ కౌశల్ బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ కి తండ్రి. యాక్షన్ కొరియోగ్రాఫర్ గా తనకంటూ ఒక సెపరేట్ స్టైల్ ని ఏర్పరచుకున్నారు ఆయన. అందుకే ఇప్పటికీ ఆయన యాక్షన్ సీన్స్ బాలీవుడ్ ఆడియన్స్ ని అలరిస్తున్నాయి. ఈ ఇయర్ వచ్చిన హరి హర వీరమల్లులో కూడా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ శ్యాం కౌశల్ కంపోజ్ చేశారని తెలుస్తుంది.
చరణ్, శివ రాజ్ కుమార్ మధ్య వచ్చే సీన్స్..
చరణ్, శివ రాజ్ కుమార్ మధ్య వచ్చే సీన్స్ ఇంకా ఆ సందర్భంలో కొన్ని యాక్షన్ సీన్స్ ని శ్యామ్ కౌశల్ సారధ్యంలో చేస్తున్నారట. దీని కోసం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ వేసి ఈ సీన్స్ షూట్ చేస్తున్నారట. పెద్ది సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్ లో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం అవుతున్నారు. పెద్ది సినిమాను 2027 మార్చి 27న పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు.
రామ్ చరణ్ పెద్ది సినిమా నుంచి ఫస్ట్ షాట్ గా ఒక టీజర్ వచ్చింది. అందులో చరణ్ కొట్టిన షాట్ కచ్చితంగా సినిమా బాక్సాఫీస్ షేక్ చేయడం ఫిక్స్ అనే హింట్ ఇస్తుంది. చరణ్ గత రెండు సినిమాలు ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయలేదు కాబట్టి ఈ సినిమాతో భారీ టార్గెట్ ని పెట్టుకున్నారు.
