Begin typing your search above and press return to search.

మేడ పైనుంచి దూకేయాల‌నుకున్న స్టార్ హీరో తండ్రి

జీవితం అంటే చాలా ఎదుర్కోవాలి. మ‌నిషి మ‌నుగ‌డ‌లో ప్ర‌తి నిమిషం గేమ్ ఛేంజ్ అవుతూనే ఉంటుంది.

By:  Tupaki Desk   |   21 July 2025 6:00 AM IST
మేడ పైనుంచి దూకేయాల‌నుకున్న స్టార్ హీరో తండ్రి
X

జీవితం అంటే చాలా ఎదుర్కోవాలి. మ‌నిషి మ‌నుగ‌డ‌లో ప్ర‌తి నిమిషం గేమ్ ఛేంజ్ అవుతూనే ఉంటుంది. అలాంటి ఒక గేమ్ ఛేంజింగ్ మూవ్ మెంట్ ని ఎదుర్కొన్నాన‌ని చెబుతున్నారు విక్కీ కౌశ‌ల్ తండ్రి శామ్ కౌశ‌ల్. ఆయ‌న ప్ర‌ముఖ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్ గా బాలీవుడ్ లో పాపుల‌ర‌య్యారు.

ఒక‌సారి షూటింగ్ స‌మ‌యంలో క‌డుపులో నొప్పి వ‌చ్చింది. త‌ట్టుకోలేనంత నొప్పి రావ‌డంతో నేరుగా ఆస్ప‌త్రిలో చేర్చారు. వైద్యులు ప‌రీక్షించాక ఆప‌రేష‌న్ చేయాల్సి ఉంటుంద‌ని నిర్థారించారు. అతడికి శ‌స్త్ర చికిత్స చేసి క‌డుపు లోంచి ఒక భాగాన్ని తొల‌గించారు. మూడు రోజుల త‌ర్వాత అత‌డు క‌ళ్లు తెరిచాడు. కానీ క‌డుపులో విప‌రీత‌మైన నొప్పి. ఆ స‌మ‌యంలో తాను చాలా బ‌ల‌హీన ప‌డిపోయాన‌ని శామ్ కౌశ‌ల్ తెలిపారు. బ‌ల‌హీన‌త‌, నొప్పి కార‌ణంగా తాను చ‌నిపోవాల‌నుకున్నాన‌ని తెలిపారు. ఆస్ప‌త్రి భ‌వంతి పై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని భావించిన‌ట్టు వెల్ల‌డించారు.

అయితే ఆ స‌మ‌యంలో పిల్ల‌లు చిన్న‌వాళ్లు. కాబ‌ట్టి మ‌రో ప‌దేళ్లు తాను బ‌త‌కాల‌ని భ‌గ‌వంతుడిని కోరుకున్నాన‌ని కూడా తెలిపాడు. ఇప్పటికి 22 ఏళ్లు అయింది.. హాయిగా సంతోషంగా ఉన్నాను. పిల్ల‌లు చాలా సంతోషంగా లైఫ్ లో సెటిలయ్యారు అని శామ్ కౌశ‌ల్ త‌న గతాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రఖ్యాత యాక్షన్ డైరెక్టర్ శామ్ కౌశల్ 2003లో తనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత ఆత్మహత్య చేసుకోవాల‌నుకున్నాన‌ని తెలిపాడు. ఆసుపత్రి భవనంపై నుండి దూకాలని అనుకున్నానని, కానీ శస్త్రచికిత్స తర్వాత కడుపులో నొప్పి కారణంగా అది కుదరలేదని తెలిపాడు. హృతిక్ రోషన్ `లక్ష్య` సినిమా షూటింగ్ సమయంలో తనకు కడుపులో నొప్పి వచ్చిందని, కానీ మొదట దానిని పట్టించుకోలేదని కౌశల్ వెల్లడించారు. అయితే శ్యామ్ బెనగల్ `నేతాజీ సుభాష్ చంద్రబోస్` సినిమా షూటింగ్ సమయంలో విపరీతమైన నొప్పి అనిపించింది. ఆసుపత్రికి తరలించారు.. అక్క‌డ‌ శస్త్రచికిత్స చేయించుకున్నారు.

ఆప‌రేష‌న్ త‌ర్వాత కూడా త‌న కుటుంబీకులు ఆందోళ‌న చెంద‌డం చూసాన‌ని శామ్ కౌశ‌ల్ అన్నారు. తాను బ‌త‌క‌న‌ని భావించిన‌ట్టు వెల్ల‌డించారు. కానీ 22 ఏళ్లుగా ఆయ‌న ఆరోగ్యంగా హాయిగా ఉన్నారు.

క్రిష్, పద్మావత్, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్, భాగ్ మిల్కా భాగ్, పికె, సంజు, టైగర్ జిందా హై, సింబా స‌హా ప‌లు చిత్రాలకు శామ్ కౌశ‌ల్ యాక్షన్ డైరెక్టర్‌గా పనిచేశారు.