Begin typing your search above and press return to search.

అర్జున్ రెడ్డి ఆమెకు కలిసి రాలేదు..!

తనకు వచ్చిన ఆఫర్ ను చేసుకుంటూ కెరీర్ సాగిస్తున్న షాలిని అవకాశం ఇస్తే చాలు ఎలాంటి పాత్రలో అయినా నటించేందుకు రెడీ అంటుంది.

By:  Tupaki Desk   |   5 April 2024 4:30 PM GMT
అర్జున్ రెడ్డి ఆమెకు కలిసి రాలేదు..!
X

అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ అవ్వగా అదే సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండే మాత్రం ఆ సినిమా సక్సెస్ ను వాడుకోలేకపోయింది. అర్జున్ రెడ్డి తర్వాత మహానటి, ఎన్.టి.ఆర్ కథనాయకుడు సినిమాల్లో నటించిన అమ్మడు కళ్యాణ్ రామ్ నటించిన 118 సినిమాలో కూడా నటించింది. మహానటి బ్లాక్ బస్టర్ అయినా షాలిని పాండే కి ఏమాత్రం హెల్ప్ అవలేదు. 118 పర్వాలేదు అనిపించుకున్నా ఆ సినిమా క్రెడిట్ అంతా కళ్యాణ్ రామ్, నివేదా థామస్ ఖాతాలోకి వెళ్లింది.

టాలీవుడ్ నుంచి కోలీవుడ్ అటు బాలీవుడ్ లో కూడా అమ్మడు తన లక్ టెస్ట్ చేసుకుంది. కానీ ఎక్కడ కూడా షాలినికి కలిసి రాలేదు. 2020 లో వచ్చిన నిశ్శబ్ధం సినిమా చేసిన షాలిని ఆ తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించలేదు. ఇక్కడ ఛాన్సులు కూడా అందుకోలేదు. రెండేళ్ల క్రితం బాలీవుడ్ లో జయేష్ భాయ్ జోర్దార్ సినిమాలో నటించిన అమ్మడు ఆ సినిమాతో కూడా సక్సెస్ అందుకోలేదు.

ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్ లో వస్తున్న మహారాజా సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో అయినా షాలిని ఫేట్ మారుతుందేమో చూడాలి. సినిమాల్లోనే కాదు వెబ్ సీరీస్ లతో కూడా అలరించాలని చూస్తున్న షాలిని అక్కడ కూడా రాణించాలని చూస్తుంది. సినిమా ఆఫర్ల కోసం ఈమధ్య పూర్తిగా సన్నబడిన షాలిని ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసేందుకు రకరకాల ఫోటో షూట్స్ చేస్తుంది.

అర్జున్ రెడ్డి హీరో, డైరెక్టర్ ఇద్దరు కూడా పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకోగా ఆ సినిమాలో నటించిన షాలిని మాత్రం కెరీర్ లో వెనకబడింది. తనకు వచ్చిన ఆఫర్ ను చేసుకుంటూ కెరీర్ సాగిస్తున్న షాలిని అవకాశం ఇస్తే చాలు ఎలాంటి పాత్రలో అయినా నటించేందుకు రెడీ అంటుంది. అర్జున్ రెడ్డి ఫ్యాన్స్ మాత్రం మళ్లీ విజయ్ దేవరకొండతో ఒక సినిమా పడితే షాలిని కెరీర్ సెట్ అవుతుందని అంటున్నారు. మరి విజయ్ ఇప్పుడు మళ్లీ షాలినితో నటించే అవకాశం ఉంటుందా లేదా అన్నది చూడాలి .ప్రస్తుతం షాలిని అడపాదడపా అవకాశాలతో రెగ్యులర్ ఫోటో షూట్స్ తో కాలం వెళ్లదీస్తుంది. ఏం చేసినా సరే మళ్లీ తెలుగులో ఆఫర్ అందుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తుంది అమ్మడు.