Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ప్ర‌తి కుక్క‌కీ ఒక రోజొస్తుంది!

ఇదిగో ఇలా ఈ పెంపుడు కుక్క‌కు ముద్దులిచ్చేస్తానంటూ ఊరించింది షాలిని. ఇక స్విమ్ సూట్ లో ఈ కుర్ర‌బ్యూటీ ఎంతో హాట్ గా క‌నిపిస్తోంది.

By:  Tupaki Desk   |   22 Sep 2023 5:35 PM GMT
ఫోటో స్టోరి: ప్ర‌తి కుక్క‌కీ ఒక రోజొస్తుంది!
X

ప్ర‌తి కుక్క‌కీ ఒక రోజొస్తుంది... అవును ఇది నిజం! దీనిని కాస్త ఆల‌స్యంగా అయినా అంగీక‌రించి తీరాలి ఈ స‌న్నివేశం చూశాక‌. అక్క‌డ అందాల భామ‌ అలా త‌న పెట్ డాగ్ ద‌రికి చేరి ముద్దులిచ్చేందుకు రెడీ అవుతుంటే ఖంగు తినాల్సొస్తోంది. డాగీ ఎంత‌గా గారాలు పోతుంటే అంత‌గా దాంతో ఆట‌లాడేసుకుంటోంది అందాల షాలిని పాండే.


ఇదిగో ఇలా త‌న‌తో ఎంతో స‌న్నిహితంగా ప్రేమ‌గా కలిసిపోయి ఆట‌లాడేయ‌డ‌మే కాదండోయ్ సంథింగ్ స్పెష‌ల్ తాయిలాన్ని దానికి ఎర వేసింది ఈ అందాల క‌థానాయిక‌. గ‌త కొంత‌కాలంగా షాలిని వ‌రుస‌గా వేడెక్కించే ఫోటోషూట్ల‌తో చెల‌రేగిపోతోంది. మునుప‌టితో పోలిస్తే నేటి కాలానికి త‌గ్గ‌ట్టుగా రివీలింగ్ దుస్తుల్లో వేడెక్కించేస్తోంది. తాజాగా మ‌రోసారి అలాంటి రివీలింగ్ ఫోటోషూట్ అమ్మడి అందాల‌ను ఎలివేట్ చేసింది. తాజా ఫోటోషూట్ లో వెరైటీ దుస్తుల్లో క‌నిపించిన షాలిని వైట్ టాప్ , డెనిమ్ జీన్స్ తో మ‌తులు చెడ‌గొట్టింది.

ఇక వేరొక లుక్ లో షాలిని పూర్తిగా పూల్ సైడ్ ట్రీట్ తో అద‌ర‌గొట్టింది. అక్క‌డ బ్లూవాట‌ర్ తో నిండి ఉన్న స్విమ్మింగ్ పూల్ లో జ‌ల‌కాలాడిన షాలిని త‌న పెట్ డాగ్ క‌నిపించ‌గానే దాంతో స‌ర‌సాలాడ‌టం ప్రారంభించింది. ఆ పెట్ డాగ్ ఎంతో మారాం చేస్తూ త‌న‌ని చేరుకుంది. ఇదిగో ఇలా ఈ పెంపుడు కుక్క‌కు ముద్దులిచ్చేస్తానంటూ ఊరించింది షాలిని. ఇక స్విమ్ సూట్ లో ఈ కుర్ర‌బ్యూటీ ఎంతో హాట్ గా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంత‌ర్జాలంలో హీట్ పెంచుతున్నాయి.

అర్జున్ రెడ్డి భారీ విజయం తర్వాత, షాలిని పాండే 100 ప‌ర్సంట్ కాదల్ (100 ప‌ర్సంట్ ల‌వ్ త‌మిళ‌ రీమేక్), మహానటి, 118, ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్దం వంటి చిత్రాలలో న‌టించింది. ఆమె చివరిగా హిందీ కామెడీ-డ్రామా చిత్రం జయేష్‌భాయ్ జోర్దార్‌లో రణవీర్ సింగ్‌తో కలిసి కనిపించింది. ఈ చిత్రానికి దివ్యాంగ్ ఠక్కర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై మనీష్ శర్మ - ఆదిత్య చోప్రా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో బొమన్ ఇరానీ- రత్న పాఠక్ షా కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

షాలిని ప్రస్తుతం తన త‌దుప‌రి చిత్రం మహారాజా షూటింగ్‌లో బిజీగా ఉంది. యాక్షన్-అడ్వెంచర్ డ్రామాను బెర్నార్డ్ విలియమ్స్ రాశారు.యు మల్హోత్రా పి. సిద్ధార్థ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో జైదీప్ అహ్లావత్, శర్వరి వాఘ్, సమీర్ పరాంజపే, రేషమ్ సహానీ, జునైద్ ఖాన్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంతో అమీర్ ఖాన్ వార‌సుడు జునైద్ ఖాన్ న‌టుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు.