Begin typing your search above and press return to search.

షాలిని పాండే.. తెల్లని చొక్కాలో కిక్కిచ్చే గ్లామర్ షో

తాజాగా వైట్ కలర్ షర్ట్ లో ఈ అమ్మడు అదిరిపోయే భంగిమలతో ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.

By:  Tupaki Desk   |   26 Feb 2024 4:09 AM GMT
షాలిని పాండే.. తెల్లని చొక్కాలో కిక్కిచ్చే గ్లామర్ షో
X

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ షాలిని పాండే. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో షాలిని పాండే తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయం అని అందరూ అనుకున్నారు. మరి ఏమైందో తరువాత మహానటి, 118, ఇద్దరి లోకం ఒకటే సినిమాలలో నటించి తరువాత టాలీవుడ్ కి దూరమైంది.

హీరోయిన్ గా ఆమెకి తెలుగులో అస్సలు అవకాశాలు రావడం లేదు. తమిళంలోకి వెళ్లి 100% కాదల్ మూవీలో నటించిన ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ ప్రయత్నాలు మొదలుపెట్టింది. బామ్ ఫాద్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. 2022లో రణవీర్ సింగ్ కి జోడీగా జయసాభాయ్ జోర్దార్ అనే మూవీలో నటించింది.

ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం మహారాజా అనే చిత్రంలో షాలిని పాండే నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే అర్జున్ రెడ్డిలో బొద్దుగా కనిపించిన షాలిని పాండే తరువాత కంప్లీట్ గా స్లిమ్ అయ్యి జీరో సైజ్ లోకి వచ్చేసింది. సినిమాలు పెద్దగా లేకపోయిన సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది.

రెగ్యులర్ గా హాట్ ఘాటైన ఫోటోషూట్ లతో కావాల్సినంత వినోదం అందిస్తూ ఉంటుంది. అందాల ప్రదర్శనలో తగ్గేదిలే అంటూ గ్లామర్ షోతో మెరిసిపోతూ ఉండటం విశేషం. తాజాగా వైట్ కలర్ షర్ట్ లో ఈ అమ్మడు అదిరిపోయే భంగిమలతో ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి.

వైట్ షర్ట్ లో షాలిని పాండే లుక్స్ కుర్రాళ్ళ మనసుని గిలిగింతలు పెడుతున్నాయి. నెటిజన్లు ఆ పిక్ పై డిఫరెంట్ కామెంట్స్ చేస్తున్నారు. లెగ్స్ అందాలు ఆమె సౌందర్యాన్ని మరింత పెంచే విధంగా ఫోటోలలో ఉండటం విశేషం. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ అమ్మడు గ్లామర్ షో చూసిన తర్వాత అయిన దర్శక నిర్మాతలు టాలీవుడ్ లో షాలిని పాండేకి మళ్ళీ అవకాశాలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తారేమో చూడాలి.