Begin typing your search above and press return to search.

బుక్ రీడింగ్ స‌రే కానీ ఇలా బుక్ చేశావేంటి?

త‌ను చ‌దువుతున్న‌ది పుస్త‌కం కాదు. మొబైల్ ఫోన్ ని పుస్త‌కంలా ప‌ట్టుకుని చ‌దువుతున్న‌ట్టుగా క‌ల‌రింగ్ ఇస్తోంది అంతే.

By:  Tupaki Desk   |   29 Sep 2023 2:12 PM GMT
బుక్ రీడింగ్ స‌రే కానీ ఇలా బుక్ చేశావేంటి?
X

ఫోన్ బ‌దులుగా ఆ చేతిలో పుస్త‌కం ఉంటే? అంటూ కొంటెగా చెప్పింది షాలిని పాండే. ఫోన్ నే పుస్త‌కంలా మ‌లుచుకుని చ‌దువు సాములో ప‌డిపోయిన‌ట్టుంది. అయితే ప్ర‌జ‌ల‌కు ఇవేవీ ప‌ట్ట‌న‌ట్టు.. షాలిని ఎలాంటి బికినీ వేసుకుందో అని మాత్ర‌మే ఆరాలు తీస్తున్నారు. ఏఐ సృష్టించిన హాట్ బొమ్మ‌లా క‌నిపిస్తున్న షాలిని పాండే బికినీ లుక్ ని అభిమానులు ప‌దే ప‌దే త‌ర‌చి చూస్తున్నారు.


అలా ఒంట‌రి ప్ర‌దేశంలో స్వేచ్ఛ‌గా క‌నిపిస్తోంది షాలిని. అంతేనా.. టూపీస్ ధ‌రించి రిలాక్స్ మోడ్ లో సేద‌దీరుతున్న షాలిని ఏదో పుస్త‌కం కానీ చ‌దువుతోందా? అన్న సందేహం క‌లుగుతోందా? అయితే మీ క‌ళ్లు మోస‌పోయిన‌ట్టే. త‌ను చ‌దువుతున్న‌ది పుస్త‌కం కాదు. మొబైల్ ఫోన్ ని పుస్త‌కంలా ప‌ట్టుకుని చ‌దువుతున్న‌ట్టుగా క‌ల‌రింగ్ ఇస్తోంది అంతే. అయితే ఒక న‌వ‌ల చ‌దువుతున్నంత‌గా లీన‌మైపోయి అలా ఫోన్ లో ఏం చూస్తోంది?

షాలినీ పాండే హిందీ స‌హా దక్షిణాది ప‌రిశ్ర‌మ‌ల్లో న‌టిస్తోంది. తొలి ప్ర‌య‌త్న‌మే అర్జున్ రెడ్డి చిత్రంలో తన అద్భుత‌ నటనతో క‌ట్టిప‌డేసిన షాలినికి వ‌రుస‌గా ఆఫ‌ర్లు వెల్లువెత్తాయి. షాలినికి తెలుగులోను గొప్ప అభిమానుల ఫాలోయింగ్ ఉంది. తన నటనా సామర్థ్యాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఇటీవ‌ల‌ తన సోషల్ మీడియా పోస్ట్‌లతోను నిరంత‌రం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల షాలిని సెప్టెంబర్ 23 న తన పుట్టినరోజును జరుపుకుంది. ఈ వేడుక‌ల నుంచి కొన్ని అద్భుత‌మైన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగా అవి వైర‌ల్ అయ్యాయి. షాలిని పాండే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అభిమానులకు తన వృత్తిపరమైన వ్యక్తిగత మైన చాలా అప్‌డేట్‌లు ఇస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవలి పోస్ట్‌లో బర్త్‌డే కేక్ కట్ చేస్తున్నప్ప‌టి ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... అర్జున్ రెడ్డి భారీ విజయం తర్వాత, షాలిని పాండే 100 ప‌ర్సంట్ కాదల్ (100 ప‌ర్సంట్ ల‌వ్ త‌మిళ‌ రీమేక్), మహానటి, 118, ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్దం వంటి చిత్రాలలో న‌టించింది. ట్యాలెంటెడ్ బ్యూటీ చివరిగా హిందీ కామెడీ-డ్రామా చిత్రం జయేష్‌భాయ్ జోర్దార్‌లో రణవీర్ సింగ్‌తో కలిసి కనిపించింది. ఈ చిత్రానికి దివ్యాంగ్ ఠక్కర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై మనీష్ శర్మ - ఆదిత్య చోప్రా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో బొమన్ ఇరానీ- రత్న పాఠక్ షా కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

షాలిని ప్రస్తుతం తన త‌దుప‌రి చిత్రం మహారాజా షూటింగ్‌లో బిజీగా ఉంది. యాక్షన్-అడ్వెంచర్ డ్రామాను బెర్నార్డ్ విలియమ్స్ రాశారు.యు మల్హోత్రా పి. సిద్ధార్థ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో జైదీప్ అహ్లావత్, శర్వరి వాఘ్, సమీర్ పరాంజపే, రేషమ్ సహానీ, జునైద్ ఖాన్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంతో అమీర్ ఖాన్ వార‌సుడు జునైద్ ఖాన్ న‌టుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు.