బికినీలో చెలరేగిన షాలిని పాండే
తాజాగా ఈ సిరీస్ లో నియాన్ గ్రీన్ (చిలుకాకు పచ్చ) బికినీలో ప్రత్యక్షమైంది. సిసిలియన్ బీచ్ లలో షాలిని ఇలా బికినీలో సేద తీరుతోంది.
By: Tupaki Desk | 20 Aug 2025 11:06 PM ISTసరైన హిట్లు పడలేదు కానీ, `అర్జున్ రెడ్డి` భామ షాలినీ పాండే రేంజ్ ఈ పాటికి వేరే లెవల్లో ఉండేది. బాలీవుడ్ లో వరుసగా అవకాశాలొస్తున్నా అవేవీ విజయాలుగా మారడం లేదు. ఇంతకుముందు హిందీ అరంగేట్ర చిత్రం `జయేష్‌భాయ్ జోర్దార్` (2022) బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫెయిల్యూర్. అగ్ర హీరో సరసన ఈ ఒక్కటీ హిట్టు పడినా తన స్థాయిని పెంచుకునేందుకు అవకాశం ఉండేది. మహారాజ్ చిత్రంలో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ సరసన పాండే కనిపించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అంతంత మాత్రమే. దీంతో షాలిని ఎంత బాగా నటించినా గుర్తింపు అయితే లేదు.
ఇడ్లీ కడై అనే తమిళ సినిమా, రాహు కేతు అనే హిందీ సినిమా చేస్తోంది షాలిని. ఇవి రెండు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. వీటిపై షాలిని చాలా హోప్స్ పెట్టుకుంది. ఈలోగానే సోషల్ మీడియాల్లో ఈ భామ తన అభిమానులకు నిరంతరం టచ్ లో ఉంటోంది. షాలిని ఇటీవల హద్దులు చెరిపేసి బికినీల్లో చెలరేగిపోతోంది. తాజాగా ఈ సిరీస్ లో నియాన్ గ్రీన్ (చిలుకాకు పచ్చ) బికినీలో ప్రత్యక్షమైంది. సిసిలియన్ బీచ్ లలో షాలిని ఇలా బికినీలో సేద తీరుతోంది.
సిసిలియన సన్ సాల్టీ స్విమ్స్! అంటూ పచ్చ రంగు లవ్ ఈమోజీని షాలిని షేర్ చేసింది. దీంతో ఈ బ్యూటీ బీచ్ పార్టీలో మునిగి తేల్తోందని అర్థమవుతోంది. షాలినితో పాటు తన స్నేహితురాలైన మేకప్ ఉమెన్ కూడా ఉన్నారు. బీచ్ పార్టీ ముగియగానే తిరిగి షూటింగుల్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. షాలిని తాజా ఫోటోషూట్ వైరల్ గా దూసుకెళుతుంటే, పచ్చ బికినీ లో షాలిని ఎంతో స్పెషల్ గా ఉందంటూ అభిమానులు కాంప్లిమెంట్లు ఇస్తున్నారు.
