అర్జున్ రెడ్డి భామకి ఆ ఛాన్స్ ఉందా..?
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమాలో షాలిని నటించింది. సినిమాలో విజయ్, షాలిని పెయిర్ అలరించింది.
By: Tupaki Desk | 10 May 2025 6:00 AM ISTఒక సినిమా సూపర్ హిట్ అయితే అందులో నటించిన హీరోకి స్టార్డం వస్తే.. అందులో నటించిన హీరోయిన్ కి కూడా అదే రేంజ్ క్రేజ్ వస్తుందని అనుకుంటారు. కానీ కొన్ని సినిమాలకు మాత్రమే అలా జరుగుతుంది. కొందరు హీరోయిన్స్ కి మాత్రం అలా జరగదు. ముఖ్యంగా ఒక సెన్సేషనల్ సినిమాలో హీరోయిన్ గా నటించినా సరే పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేదు. ఇంతకీ ఇక్కడ ప్రస్తావిస్తున్న సినిమా ఏది.. ఆ హీరోయిన్ ఎవరు అంటే ఆ సినిమా అర్జున్ రెడ్డి అయితే ఆ హీరోయిన్ షాలిని పాండే.
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమాలో షాలిని నటించింది. సినిమాలో విజయ్, షాలిని పెయిర్ అలరించింది. ఐతే ఈ సినిమా సూపర్ హిట్ కాగా విజయ్ దేవరకొండకు సూపర్ స్టార్ డం వచ్చింది. ఒక కొత్త అబ్బాయి ఇలా చేయగలడా అని ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాడు. అర్జున్ రెడ్డితోనే విజయ్ దేవరకొండ అసలు కెరీర్ మొదలైంది. అంతేకాదు కెరీర్ టర్న్ కూడా ఆ సినిమా నుంచే మొదలైంది.
ఐతే ఆ సినిమాలో నటించిన హీరోయిన్ షాలిని పాండేకి మాత్రం పెద్దగా కలిసి రాలేదు. ఆ సినిమా తర్వాత మహానటి, ఎన్ టీ ఆర్ కథానాయకుడు, 118 సినిమాల్లో నటించింది షాలిని పాండే. అర్జున్ రెడ్డి తర్వాత అమ్మడు కథల ఎంపికల్లో చేసిన తప్పుల వల్లే ఆమె కెరీర్ అలా అయ్యింది. తెలుగులో వర్క్ అవుట్ అవ్వట్లేదని తమిళ్ లో ప్రయత్నాలు చేసింది అమ్మడు. అకడ కూడా పెద్దగా క్లిక్ అవ్వలేదు.
ఇక బాలీవుడ్ లో కూడా షాలిని సినిమాలు చేస్తూ వచ్చింది. సినిమాలు, సీరీస్ లతో బీ టౌన్ ఆడియన్స్ ని మెప్పించాలని చూస్తుంది షాలిని పాండే. అందం అభినయం రెండు ఉన్నా షాలిని ఎందుకో ఆశించిన స్థాయి క్రేజ్ తెచ్చుకోలేదు. ప్రస్తుతం అమ్మడు తమిళంలో ధనుష్ నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఇడ్లీ కడైలో నటిస్తుంది. ఆ సినిమాతో పాటు హిందీలో రాహు కేతు సినిమా చేస్తుంది. ఐతే తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాకు సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ షాలిని మీద కూడా అభిమానం కలిగి ఉన్నారు. అమ్మడికి మళ్లీ తెలుగులో ఛాన్స్ లు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఐతే ఆల్రెడీ టాలీవుడ్ లో ఫెయిల్ అయిన షాలినికి మళ్లీ ఆ అవకాశం ఉంటుందా అన్నది చెప్పడం కష్టమే.
